NTV Telugu Site icon

Metro : మెట్రో ప్లాట్‌ఫారమ్‌పై పడిన పిల్లాడిని ప్రాణాలకు తెగించి కాపాడిన గార్డ్

New Project (84)

New Project (84)

Metro : పూణే మెట్రోకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వీడియోలో ఒక మహిళ మెట్రో ట్రాక్‌పైకి దూకి తన బిడ్డను రక్షించడాన్ని చూడవచ్చు. మహిళ బిడ్డ మెట్రో ట్రాక్‌పై పడిపోయింది. తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో మహిళ కూడా ట్రాక్‌పైకి దూకింది. ఈ కేసు పూణేలోని సివిల్ కోర్ట్ మెట్రో స్టేషన్‌కు సంబంధించినది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. వీడియోలో అక్కడ ఉన్న ఒక బాటసారుడు పిల్లవాడిని రక్షించడానికి ట్రాక్‌పైకి దూకడం కూడా చూడవచ్చు.

Read Also:Jogi Ramesh: ఎమ్మెల్యే పార్థసారథి vs జోగి రమేష్ మధ్య మాటల యుద్ధం..

మహిళ బిడ్డ మెట్రో ప్లాట్‌ఫారమ్‌పై నడుస్తుండగా కాలు జారి ట్రాక్‌పై పడిపోయాడు. చిన్నారి పడిపోవడం చూసి మహిళ కూడా దూకింది. ఈ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులు కూడా మహిళకు సహాయం చేసేందుకు పరుగులు తీశారు. ఈ సమయంలో, స్టేషన్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డు వికాస్ బంగర్ ఎమర్జెన్సీ బటన్‌ను నొక్కాడు. దాని కారణంగా ఇన్‌కమింగ్ రైలు ఆగిపోయింది. మెట్రో స్టేషన్‌కు కేవలం 30 మీటర్ల దూరంలో ఇన్‌కమింగ్ రైలు ఆగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం, బిడ్డ, తల్లి సురక్షితంగా బయటపడడం విశేషం. ఈ ఘటన నేపథ్యంలో చిన్న పిల్లలతో ప్రయాణించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పూణే మెట్రో విజ్ఞప్తి చేసింది.

Read Also:Ayodha Ram Mandir: అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుక.. ప్రధాని మోడీ షెడ్యూల్ ఇదే!