శాంతి చర్చలలో ఆర్కె కీలకమైన వ్యక్తి అని ప్రో. హరగోపాల్ అన్నారు. చరిత్రలో అదో గీటు రాయి. చర్చలు సఫలం..విఫలం అనేది సమస్య కాదు. ఒక ముండడు పడింది. ఆర్కె లేని లోటు పార్టీ కి కొంత నష్టమే. పార్టీ స్థాపించిన వాళ్ళే బయటకు వచ్చారు. కానీ ఆర్కె నమ్మిన సిద్దాంతం కోసం పని చేశారు. ప్రభుత్వం వైద్యం అందించాలి అనుకోవడం మానవత్వం అని అన్నారు. కానీ ప్రభుత్వం వైద్యం అందిస్తుందని అనుకోవడం ఆశనే. మట్టుపెట్టలాని చూసే ప్రభుత్వం… వైద్యం అందిస్తుం దా అని అడిగారు. సహచరి గా శిరీష డిమాండ్ లో తప్పులేదు. కానీ అది జరిగే పని కాదు. అభివృద్ధి నమూనా మరినప్పు డే సమస్యలకు పరిష్కారం. ఉమ్మడి రాష్ట్రంలో చర్చలు జరగడం లో ఆర్కె పాత్ర కీలకం. మావోయిస్టుల లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి… కానీ ఎక్కడో ఓ చోట పరిష్కారం కావాలని చూసిన వ్యక్తి ఆర్కె. ఆయుధాలు విడిచి చర్చకు రావాలని ప్రభుత్వం పెట్టిన షరతుల కూడా ఆర్కె చొరవ గొప్పది. ఒక వ్యక్తి చనిపోతే ఉద్యమం పంథా మారుతుంది కానీ ఉద్యమాలు ఆగవు. తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉన్నా…. ఎవరి పంథా వారికి ఉంటుంది అని పేర్కొన్నారు.