Site icon NTV Telugu

Viral video: పంతులమ్మా.. స్కూల్‌లో ఇవేం పనులు.. పాఠాలు చెప్పకుండా ఏం చేసిందంటే..!

Teacher

Teacher

గురువులంటే.. విద్యార్థులకు.. సమాజానికి మాదిరిగా ఉండాలి. తల్లిదండ్రుల తర్వాత పిల్లలు ఎక్కువగా ఉండేది బడిలోనే. టీచర్లతోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. అలాంటిది ఉపాధ్యాయులు ఎంత క్రమశిక్షణగా.. ఆదర్శంగా ఉండాలి. జీతాలేమో.. లక్షల్లో తీసుకుంటారు. చేసే పనులేమో ఇలాంటి పనులు. ఏకంగా ఓ పంతులమ్మ.. స్కూల్‌ని బ్యూటీ పార్లర్‌గా మార్చేసింది. స్కూల్‌లోనే దర్జాగా తతాంగం జరిగించింది. ఆమె బాగోతాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్న వారిపై ఎలాంటి ప్రతాపం చూపించిందో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Salman Khan: భారీ భద్రతతో దుబాయ్ వెళ్లిన సల్మాన్ ఖాన్.. ఎందుకంటే?

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లా దండమావు గ్రామంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సంగీతా సింగ్ విద్యార్థులకు పాఠాలు బోధించకుండా బడిలోనే ఫేషియల్‌ చేయించుకుంది. విద్యార్థులకు వంట చేసే గదిలోనే ఫేషియల్‌ చేయించుకుంటుంది. అయితే అదే పాఠశాలలో పని చేస్తున్న అనమ్ ఖాన్ అనే ఉపాధ్యాయురాలు దీన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది. దీన్ని గమనించిన సంగీతా సింగ్.. ఒక్కసారిగా ఆవేశంగా కూర్చీపై నుంచి లేచి వాగ్వాదానికి దిగింది. అంతేకాకుండా ఆ టీచర్ చేయిను కూడా కొరికేసింది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. టీచర్‌పై దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కునేందుకు సంగీతాసింగ్ తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ ఆమె వల్ల కాలేదు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయురాలికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇందుకు సంబంధించిన వీడియోను అనమ్ ఖాన్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇందులో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్‌ చేయించుకుంటున్న వీడియోతో పాటు గాయాలతో ఉన్న వీడియోను సైతం పోస్టు చేసింది. దీంతో ఈ రెండు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఘటనపై విద్యాశాఖ అధికారులకు అనమ్ ఖాన్ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయురాలిపై విచారణకు ఆదేశించారు. అనమ్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు. ఇక వీడియో ఏంటో మీరు కూడా చూసేయండి.

 

Exit mobile version