ప్రగ్యా జైస్వాల్.. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయిన సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫొటోలతో కుర్ర కారు మతి పోగొడుతుంది.. గ్లామర్ పరంగా కరెక్ట్ ఫిగర్ అయిన ఈ అమ్మడుకు సినీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి.. దాంతో సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది.. బికినీ ఫొటోలతో బోల్డ్ ఫోటో షూట్ చేస్తుంది..అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఆమె వేసుకున్న డ్రెస్స్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఫేట్ మారలేదు. చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేని ప్రగ్యా మేకర్స్ వైపు ఆశగా చూస్తుంది. ప్రగ్యా జైస్వాల్ బాలయ్య-బోయపాటి శ్రీను మూవీలో ఛాన్స్ వచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో అమ్మడుకు వరుస ఆఫర్స్ వస్తాయని అందరు అనుకున్నారు. కానీ అలా జరగలేదు.. ఇక అందాన్ని వేస్ట్ చెయ్యకుండా సోషల్ మీడియాలో హీటేక్కించే ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.. తాజాగా రాయల్ లుక్ లో మెరిసింది. ఈ సందర్భంగా తను ధరించిన డ్రెస్ ధర నెట్టింట హాట్ టాపిక్ గా మారింది..
ఈ డ్రెస్సును రకుల్ పెళ్లి కోసమే ప్రత్యేకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది.. తాజాగా కొన్ని ఆకర్షణీయమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే ప్రాగ్యా ధరించిన డ్రెస్ కాస్ట్ హాట్ టాపిక్ గ్గా మారింది.. ఆ డ్రెస్ విలువల రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు.. ధర ఎక్కువైన కూడా అమ్మడు చాలా అందంగా ఉందని తెలుస్తుంది.. ఇక సినిమాలు మాత్రం అమ్మాయిగారికి అందని ద్రాక్షలాగా మారాయి.. గత ఏడాది మొత్తం ఒక్క సినిమా కూడా రాలేదు.. కనీసం ఈ ఏడాది అన్నా బోణి కొడుతుందేమో చూడాలి..