Site icon NTV Telugu

Darling Re-Release: బాక్సాఫీస్ వద్ద ‘డార్లింగ్’ సరికొత్త రికార్డు!

Darling Re Release

Darling Re Release

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం ‘డార్లింగ్’. దశాబ్దం క్రితం వచ్చిన ఈ సినిమా నేటికీ యూత్‌లో ఒక హాట్ ఫేవరెట్. తాజాగా ఈ మూవీ రీ-రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను తిరగరాస్తోంది. తాజా వసూళ్లు చూస్తుంటే కొత్త సినిమాలకు కూడా డార్లింగ్ గట్టి పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా రీ-రిలీజ్ అయిన మొదటి రోజే ‘డార్లింగ్’ ఊహించని విధంగా 7 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో రోజు కూడా అదే జోరును కొనసాగిస్తూ 2 కోట్ల పైచిలుకు రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లోనే ఈ సినిమా 9.36 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఒక రీజనల్ సినిమా రీ-రిలీజ్‌లో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అనేది ప్రభాస్ స్టామినాకు నిదర్శనం.

ముఖ్యంగా ప్రభాస్-కాజల్ కెమిస్ట్రీ వీరిద్దరి పెయిర్ వెండితెరపై మళ్ళీ చూడటానికి ఫ్యాన్స్ క్యూ కడుతున్నారు. దీనికి తోడు జీవీ ప్రకాష్ మ్యూజిక్.. ‘ఇంకా ఏదో’, ‘నీవే నీవే’ వంటి సాంగ్స్ థియేటర్లలో రీ-సౌండ్‌తో హోరెత్తిపోతున్నాయి. ప్రభాస్ కామెడీ టైమింగ్, చంద్రమోహన్, ప్రభుల నటన ప్రేక్షకులను మళ్ళీ అలరిస్తోంది. ఇటీవల కాలంలో మహేశ్ బాబు ‘మురారి’, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమాలు రీ-రిలీజ్‌లో సందడి చేశాయి. ఇప్పుడు ప్రభాస్ ‘డార్లింగ్’ ఆ జాబితాలో చేరి సరికొత్త రికార్డులను సెట్ చేస్తోంది. డార్లింగ్ సినిమా క్లాస్ ఆడియన్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకోవడమే ఈ విజయానికి ప్రధాన కారణం.

Exit mobile version