NTV Telugu Site icon

Honda CB350: రాయల్ ఎన్ ఫీల్డ్‎కు ‘బుల్లెట్’ దింపనున్న హోండా కొత్త బైక్

Honda Cb350

Honda Cb350

Honda CB350: హోండా కంపెనీ Honda CB350పేరుతో శక్తివంతమైన ఇంజన్ తో కొత్త బైకును తీసుకువచ్చింది. దీని ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రజాదరణ ఏ పాటితో చెప్పనక్కర్లేదు. నేడు బండి కొనుక్కోవాలనుకునే భారతీయ యువత మొదటి ఎంపిక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. అటువంటి పరిస్థితిలో దాని దరిదాపుల్లో కూడా మరో బైక్‌ ఉండే అవకాశం ప్రస్తుతానికి కనిపించడం లేదు. రాయల్ ఎన్ ఫీల్డ్ ఏర్పడిన క్రేజ్ అలాంటిది మరి. కానీ హోండా ఆ సాహసం చేసింది. తన CB 350తో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీ ఇచ్చింది. అమ్మకాల పరంగా ఈ బైక్ చాలా వెనుకబడి ఉన్నప్పటికీ… ఇప్పుడు కంపెనీ తన అప్‌డేటెడ్ వేరియంట్‌ను విడుదల చేసింది. క్రూయిజర్ సెగ్మెంట్లో వస్తున్న ఈ బైక్ చాలా స్టైలిష్ గా ఉంది. ఇది 349 cc BS6 ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ బైక్ 2 మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి హోండా CB350RS, మరొకటి Honda H ness CB350.

దీని ధర రూ. 1.5 లక్షల నుంచి మొదలవుతుంది. హోండా రెండు బైక్‌ల ఫీచర్లను స్వల్ప మార్పులు చేసి అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పుడు ఇందులో మునుపటి కంటే ఎక్కువ ఫీచర్లను పొందుపరిచారు. కస్టమర్‌లు కోరుకుంటే, వారు కంపెనీ బిగ్‌వింగ్ డీలర్‌షిప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ డెలివరీలు ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నాయి.

కొత్త హోండా CB350కి మార్పులు
హోండా కొత్త CB350లో అనేక మార్పులు చేసింది. వీటిలో ఒకటి దాని సిలిండర్‌ మార్పు. దీని కారణంగా, రైడర్ కు వైబ్రేషన్ సమస్య ఉండదు. అంతే కాకుండా అందులో ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ కూడా ఇవ్వడంతో ఎమర్జెన్సీ సమయంలో బ్రేకులు వేసినప్పుడు వెనుక ఉన్న వాహనాలను అప్రమత్తం చేస్తుంది. ఈసారి రెండు బైక్‌లలో ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్ సిస్టమ్ ఇవ్వబడింది. ఈ ఫీచర్ ఏప్రిల్ 1, 2023 నుండి ప్రతి ద్విచక్ర వాహనానికి తప్పనిసరి చేయబడింది. ఎగ్జాస్ట్ సౌండ్‌ని బ్యాలెన్స్ చేయడానికి.. ఈసారి పెద్ద 45 mm టెయిల్‌పైప్ అమర్చబడింది. కొత్త బైక్‌లకు స్ప్లిట్ టైప్ సీటు ఇచ్చారు. ఇది మునుపటి కంటే మరింత సౌకర్యవంతంగా ఉండబోతోందని కంపెనీ పేర్కొంది.

కొత్త హోండా బైక్ ఇంజన్, ధర
ఈ రెండు బైక్‌లు 349 సిసి ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఇంజన్ 20 బిహెచ్‌పి పవర్, 30 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. దాని ధర గురించి మాట్లాడినట్లయితే, కొత్త బైక్‌ల ధర ఇప్పుడు కంటే రూ.11000 ఎక్కువగా ఉంటుంది. దీని ప్రకారం, హోండా హెచ్‌నెస్ ధర రూ. 2.10 లక్షలు నుంచి రూ. 2.14 లక్షలు.