టాలీవుడ్‌లో ఎప్పుడూ కొత్త జోడీలపై ప్రేక్షకులకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలతో తొలిసారి జత కడుతున్న టాప్ హీరోయిన్ల సినిమాలు ఎప్పుడు హైప్ క్రియేట్ చేస్తాయి. అలాంటి క్రేజ్ ఇప్పుడు నితిన్ – పూజా హెగ్డే జోడీపై నెలకొంటోంది. కొంతకాలంగా తెలుగు తెర నుంచి దూరంగా ఉన్న పూజా, మళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తోందన్న వార్త అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తిస్తోంది.
Also Read : Peddhi : బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ఆ స్టార్ హీరోయిన్‌తో ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్..!
పూజా హెగ్డే గత కొన్నేళ్లలో టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటీమణి. ‘అల వైకుంఠపురములో’, ‘మొహంజోదారో’, ‘రాధే శ్యామ్’ వంటి చిత్రాలతో తన అందం, నటనతో ఆకట్టుకున్న ఆమె, ఇటీవల బాలీవుడ్, తమిళ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఫలితంగా, తెలుగు ప్రేక్షకులు ఆమెను వెండితెరపై చూడటానికి కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక నితిన్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన కెరీర్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్నప్పటికి ఫలితం మాత్రం దక్కడం లేదు. యాక్షన్, రొమాంటిక్, కామెడీ జానర్లలో ప్రయోగాలు చేస్తూ, ప్రతి సినిమాతో కొత్త లుక్, కొత్త బాడీ లాంగ్వేజ్‌ని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆయన విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాకు సైన్ చేసినట్లు సమాచారం. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమా గుర్రపు స్వారీ (Horse Riding) నేపథ్యంలో సాగుతుంది. నితిన్ పాత్ర ఒక ప్రొఫెషనల్ హార్స్ రైడర్‌గా ఉండనుందట. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా గుర్రపు స్వారీ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారని వినిపిస్తోంది. అలా ఈ చిత్రానికి ‘స్వారీ’ అనే టైటిల్‌ను పక్కా చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉందట.
