NTV Telugu Site icon

Viral Video : వావ్ సూపర్.. డ్యాన్స్ తో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసిన ఆఫీసర్.. వీడియో వైరల్..

Traffic

Traffic

ప్రతి మనిషిలో ఏదొక టాలెంట్ ఉంటుంది.. అవసరాన్ని బట్టి బయటకు వస్తుంది. ఒకరు కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేస్తారు.. సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. తాజాగా ట్రాఫిక్ లో ఓ కానిస్టేబుల్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అతని డ్యాన్స్ ను చూసిన వారంతా ఫిదా అవుతున్నారు.. అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుపై ట్రాఫిక్‌ను నియంత్రించడాన్ని గమనించవచ్చు. అయితే అతను డ్యాన్స్ చేస్తూ, ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయడాన్ని చూడవచ్చు. ఒకసారి మూన్‌వాక్‌తో, మరోమారు స్టెప్పులు వేస్తూ వాహనాలకు సరిగ్గా సిగ్నల్ ఇస్తూ అదిరిపోయే డ్యాన్స్ ను చేశాడు.. అందుకు సంబందించిన వీడియోను ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..

ఈ వీడియో నాగాలాండ్ ప్రభుత్వ పర్యాటక, ఉన్నత విద్యా శాఖ మంత్రి టెమ్‌జిన్ ఇమ్నా అలోంగ్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 51 వేల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. వీడియోను చూసిన ఒక యూజర్‌ కామెంట్‌ బాక్స్‌లో.. ‘మా సింగం సార్.. ఇండోర్ నుండి వచ్చారు… ఆయన డ్యాన్స్ చూసేందుకే నేను అటు వెళ్తాను అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..