Site icon NTV Telugu

PM Kisan: రైతులకు శుభవార్త.. కిసాన్ నిధి విడుదల…(వీడియో)

Maxresdefault (32)

Maxresdefault (32)

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రైతులకు శుభవార్త చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి 17వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 9.26 కోట్ల మంది రైతులకు రూ. 20 వేల కోట్లకు పైగా నగదు బదిలీ చేయనున్నారు. వారణాసి నుంచి రిమోట్ బటన్ నొక్కడం ద్వారా ఈ నిధులను విడుదల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం 2019లో అన్నదాతలకు సాయం చేసేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున సంవత్సరానికి రూ. 6,000 రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు.
YouTube video player

Exit mobile version