NTV Telugu Site icon

PM Kisan : కేంద్రం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం నిధులు విడుద‌ల..

Pm Kisan Samman Nidhi

Pm Kisan Samman Nidhi

PM Kisan Samman Nidhi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం 2018లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వ్యవస్థను ప్రవేశపెట్టింది. వ్యవసాయం, సంబంధిత కార్యకలాపాలలో రైతులకు ఆర్థిక సహాయం అందించడం కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.2,000 జమ చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 9.3 కోట్ల మంది రైతులు లబ్ది పొందారు.

Kishan Reddy : జమ్మూ & కాశ్మీర్‌కు బీజేపీ ఇంచార్జ్ గా కిషన్ రెడ్డి..

ఇక తాజాగా మూడోసారి ఏర్పాటైన నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వం ఇటీవల 17వ విడత సహాయాన్ని ప్రకటించింది. కొత్త ప్రభుత్వం తొలి సంతకంగా దాదాపు 20,000 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అయితే, ఈ నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యాయో లేదో వారి ఆన్‌లైన్‌ లో తనిఖీ చేయవచ్చు. పిఎం కిసాన్ పథకం 17వ విడత విడుదలైన తర్వాత., కృషి సఖిలుగా నియమించబడిన 30,000 కంటే ఎక్కువ స్వయం సహాయక బృందాలకు ప్రధాని మోడీ సర్టిఫికేట్‌లను మంజూరు చేస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో సమన్వయంతో కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

Viral Video: తాత, బామ్మ ఎవ్వారం మాములుగా లేదుగా.. కెటిఎమ్ బైక్ పై రయ్.. రయ్.. అంటూ

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 17వ విడతను 18 జూన్ 2024న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఈ చర్య దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. ఇందుకోసం మొత్తం రూ.20,000 కోట్లు ఖర్చు కానుంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు.

Show comments