NTV Telugu Site icon

Olympics India: వేరే దేశాలకు ఒలంపిక్ పతకాలు సాధించిన భారత సంతతి క్రీడాకారులు ఎవరో తెలుసా..?

Olympics 2024

Olympics 2024

Olympics India: జూలై 26 నుండి పారిస్ ఒలింపిక్స్ మొదలు కానున్నాయి. ఇందులో ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 10,500 మంది క్రీడాకారులు పాల్గొంటారు. గత టోక్యో ఒలింపిక్స్‌ లో భారత్ మొత్తం 7 పతకాలను గెలుచుకుంది. ఇక రాబోయే ఎడిషన్‌ లో భారత జట్టు ఆటగాళ్లు పతకాల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. ఈసారి భారత్‌ కు చెందిన 117 మంది ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే భారతీయ సంతతికి చెందిన వేరే దేశాలకు పతకాలు సాధించిన ఆటగాళ్ల గురించి మీకు తెలుసా..? అవునండి భారత సంతతి క్రీడాకారులు ఒలంపిక్స్ లో వేరే దేశాలకు మెడల్స్ అందిచారు. మరి వారి వివరాలను ఒకసారి చూద్దాం.

Maoists Attack: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఎస్టీఎఫ్ జవాన్లు, మహిళా నక్సల్ మృతి..

మోహినీ భరద్వాజ:

2004 ఒలింపిక్ క్రీడలు ఏథెన్స్‌లో రజత పతకం సాధించిన అమెరికన్ జిమ్నాస్ట్ మోహినీ భరద్వాజ్ ఫిలడెల్ఫియా పెన్సిల్వేనియాలో జన్మించారు. ఒలింపిక్స్‌ లో పతకం సాధించిన తొలి భారతీయ అమెరికన్ మోహిని. ఆమె ఉత్తర భారతదేశం చెందిన మహిళా. అతని తండ్రి పేరు అరుణ్ భరద్వాజ్, తల్లి పేరు ఇందు. మోహిని 4 సంవత్సరాల వయస్సు నుండి ఈ క్రీడను ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది.

రాజ్ భావసర్:

అమెరికాలోని టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో జన్మించిన మరో అమెరికన్ జిమ్నాస్ట్ ప్లేయర్ రాజ్ భావ్‌సర్. అతను 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. భావ్‌సర్ తండ్రి గుజరాత్‌ లోని వడోదరకు చెందినవారు. తల్లి ఉగాండాలోని కంపాలాలో జన్మించారు. భావ్‌సర్‌ తన ప్రాథమిక విద్యను గుజరాత్‌లో పూర్తి చేశాడు. అతని తండ్రి ఉద్యోగం వెతుక్కుంటూ అమెరికా వెళ్లి అక్కడే ఉంటున్నాడు. భావ్‌సర్ అమెరికాలోనే జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడు.

Real Estate : లగ్జరీ హౌస్ అమ్మకాల్లో హైదరాబాద్ టాప్.. సిబిఆర్‌ఇ నివేదిక

రాజీవ్ రామ్:

2016 ఒలింపిక్స్ రియో ఎడిషన్‌లో రాజీవ్ రామ్, వెటరన్ టెన్నిస్ ప్లేయర్ వీనస్ విలియమ్స్‌తో కలిసి అమెరికాకు మిక్స్‌డ్ డబుల్స్‌లో రజత పతకాన్ని అందించారు. రాజీవ్ స్వస్థలం కర్ణాటక రాజధాని బెంగళూరు. అతను అమెరికా తరపున ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, US ఓపెన్ కూడా ఆడాడు . అయితే ఈ టోర్నీల్లో అతను ఏ ట్రోఫీని గెలవలేదు.

అలెక్సీ సింగ్ గ్రోవాల్:

అలెక్సీ సింగ్ గ్రేవాల్ అమెరికాలోని పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించారు. అతనికి రిషి, రంజీత్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో అలెక్సీ చరిత్ర సృష్టించాడు. రోడ్ రేస్‌ లో బంగారు పతకం సాధించిన తొలి అమెరికన్ సైక్లిస్ట్‌గా నిలిచాడు. అతని సోదరులిద్దరూ సైక్లింగ్ చేసేవారు. 2004లో గ్రేవాల్ ‘USA బైసైక్లింగ్ హాల్ ఆఫ్ ఫేమ్’ కి కూడా ఎన్నికయ్యారు.

Show comments