Site icon NTV Telugu

PKK Turkey Peace: తుర్కియేలో 40 ఏళ్ల పోరాటానికి ముగింపు..

Pkk Turkey Peace

Pkk Turkey Peace

PKK Turkey Peace: తుర్కియేలో 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి కుర్దిష్ PKK ఆదివారం ముగింపు ప్రకటించింది. టర్కీని 40 ఏళ్లకు పైగా పీడించిన ఈ భయంకరమైన యుద్ధం ఇక ముగిసింది. కుర్దిష్ PKK ఆదివారం తన మొత్తం సైన్యాన్ని, యోధులు, ఆయుధాలు ప్రతిదీ టర్కిష్ నేల నుంసీ ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇది కేవలం ఉపసంహరణ మాత్రమే కాదని, నిరాయుధీకరణ వైపు ఒక ప్రధాన అడుగుగా ఈ ప్రకటనలో పేర్కొంది. ఉత్తర ఇరాక్‌లోని ఖాండిల్ పర్వతాల నుంచి విడుదల చేసిన ఈ ప్రకటనలో PKK “స్వేచ్ఛాయుత, ప్రజాస్వామ్య, సోదర జీవితానికి పునాది వేయడానికి టర్కీ నుంచి మా అన్ని దళాలను ఉపసంహరించుకుంటున్నాము” అని పేర్కొంది. ఈ ప్రకటన టర్కీకి ఒక వేడుక కంటే తక్కువ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Jubilee Hills By Poll Elections 2025: జూబ్లీహిల్స్లో రెండు విడతలుగా సీఎం ఎన్నికల ప్రచారం !

PKK నేపథ్యం ఏంటి..
PKK లేదా కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీని 1978లో అబ్దుల్లా ఓకలన్ స్థాపించారు. ప్రారంభంలో ఆగ్నేయ టర్కీలో ప్రత్యేక కుర్దిష్ రాజ్యాన్ని స్థాపించడమే వారి లక్ష్యంగా ఉండేది. అయితే కాలక్రమేణా వారి లక్ష్యాలు మారాయి. వారు ఇప్పుడు కుర్దులకు ఎక్కువ హక్కులు, పరిమిత స్వయంప్రతిపత్తిని డిమాండ్ చేశారు. 1984 నుంచి వారు టర్కీపై గెరిల్లా యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధం ఫలితం పౌరులు, సైనికులు, PKK యోధులు సహా 40 వేల మందికి పైగా మరణించారు. టర్కీ, అమెరికా యూరోపియన్ యూనియన్ దీనిని ఉగ్రవాద సంస్థగా పేర్కొంది. ఈ సంస్థకు ఉత్తర ఇరాక్‌లో స్థావరాలు ఉన్నాయి. ఈ స్థావరాలపై టర్కీ సైన్యం క్రమం తప్పకుండా దాడులు చేసేది. ఆగ్నేయ టర్కీలోని కుర్దిష్ మెజారిటీ ప్రాంతాలు నాశనమయ్యాయి. అనేక గ్రామాలు కాలిపోయాయి, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధం టర్కీ ఆర్థిక వ్యవస్థను క్షీణింపజేయడంతో పాటు, ట్రిలియన్ల డాలర్ల నష్టాలను మూటగట్టుకునేలా చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

మలుపు తిప్పిన ప్రకటన..
మే 2025లో జైలులో ఉన్న PKK నాయకుడు అబ్దుల్లా ఒకలాన్ “మీ ఆయుధాలను విడిచిపెట్టండి, సంస్థను రద్దు చేయండి. సాయుధ పోరాటం ముగిసింది” అని ప్రకటించాడు. ఒకలాన్ 1999 నుంచి ఇమ్రాలీ జైలులో ఉన్నాడు, కానీ అతని ప్రభావం సంస్థపై అలాగే ఉంది. ఆయన ప్రకటనను PKK అంగీకరించింది. జూలైలో కొంతమంది యోధులు తమ ఆయుధాలను తగలబెట్టారు. ఆ తర్వాత ఆదివారం 25 మంది యోధులతో క్వాండిల్‌లో విలేకరుల సమావేశం జరిగింది. “మేము టర్కీ నుంచి పూర్తిగా వైదొలుగుతున్నాము. మేము ఉత్తర ఇరాక్‌లోని మెడియా డిఫెన్స్ ఏరియాకు మకాం మారుస్తాము” అయితే వారికి న్యాయం జరగాలని PKK హెచ్చరించింది. PKK సభ్యులు ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి ప్రవేశించడానికి వీలుగా ఏకీకరణ చట్టాన్ని, ప్రత్యేక క్షమాభిక్ష చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. తాజా ప్రకటనపై టర్కీ పార్లమెంట్ ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహించే 51 మంది సభ్యుల కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ వీళ్ల ప్రకటనపై చట్టపరంగా ముందుకు వెళ్తుంది.

టర్కీ ప్రభుత్వం ఈ ప్రకటనపై స్పందిస్తూ.. తుర్కియే కుర్దిష్ హక్కులకు మద్దతు ఇస్తుందని కానీ వేర్పాటువాద ఉద్యమాలను సహించదని నిరంతరం చెబుతోందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటన వచ్చిన తర్వాత కూడా అన్ని సవాళ్లు సమసిపోలేదని చెప్పింది. అమెరికా మిత్రదేశంగా ఉన్న సిరియాలో PKKకి YPGతో సహా ఇతర వర్గాలు ఉన్నాయని చెప్పింది. టర్కీ వాటిని PKK అనుకూల వర్గాలుగా పేర్కొంది.

READ ALSO: Pangong Lake Bunkers: డ్రాగన్ వక్ర బుద్ధి.. భారత్ సరిహద్దులో చైనా కొత్త బంకర్లు

Exit mobile version