NTV Telugu Site icon

Viral Video : పానీపూరి లవర్స్ షాక్.. ఇది చూస్తే జన్మలో తినరు..

Panipuriii

Panipuriii

పానీపూరి పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరతాయి.. ఆ వాసనకే కడుపు నిండిపోతుంది.. అలాగే రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే.. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరు లొట్టలు వేసుకుంటూ తింటారు.. అలాంటి పానీపూరిని క్రేజ్ పేరుతో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. తాజాగా పిజ్జా పానీపూరి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుడ్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.. అందులో కొన్ని వీడియోలు జనాలకు పిచ్చెక్కిస్తున్నాయి.. తాజాగా ఉ వీడియో పానీపూరి లవర్స్ కు కన్నీళ్లు తెప్పిస్తుంది.. ఆ వైరల్ వీడియోలో పిజ్జా పానీపూరిని ఎలా తయారు చేస్తారో చూపించారు.. అది కాస్త ఓ రేంజులో చక్కర్లు కొడుతుంది..

ఓ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి పిజ్జా పానీపూరిని చేశాడు.. ముందుగా చిన్న చిన్న పూరిలను తీసుకున్నాడు.. వాటికి హాల్ పెట్టి పక్కన పెట్టాడు.. ఆ తర్వాత ఓ గిన్నె తీసుకున్నాడు పిజ్జాకు తయారు చేసినట్లు అన్ని వేసి వాటిని పూరిలల్లో వేసి దానిపై ఏవో సాస్ లను వేసాడు.. పైన చీజ్ వేసాడు.. ఒవేన్ లో పెట్టాడు.. దాని పై చిల్లి ఫ్లెక్స్ వేసి సర్వ్ చేశాడు.. అంతే దాన్ని లొట్టలు వేసుకుంటూ తింటారు.. ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు.. పానీపూరి లవర్స్ మాత్రం కామెంట్స్ చేస్తున్నారు.. మీరు ఆ వీడియో పై ఓ లుక్ వేసుకోండి..

Show comments