Home Insurance: డిజిటల్ పేమెంట్స్‌లో అగ్రగామి ఫోన్ పే యాప్ ఇప్పుడు వినియోగదారుల కోసం సరికొత్త హోమ్ ఇన్సూరెన్స్ పాలసీని ప్రారంభించింది. ఫోన్ పే యాప్ యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాం. 2016లో ప్రారంభమైన ఈ యాప్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్, బిల్లు చెల్లింపులు, రీచార్జీలు మాత్రమే కాకుండా మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి ఆర్థిక సేవలు కూడా సులభంగా పొందవచ్చు.
Wedding Tradition: ఇదేమి ఆచారామయ్య బాబు.. పెళ్లి చేసుకుంటే కొరడా దెబ్బలు?
అయితే తాజాగా కేవలం రూ.181 వార్షిక ప్రీమియంతోనే ఇంటికి మాత్రమే కాకుండా.. ఇంట్లోని ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, ఇతర విలువైన వస్తువులు కలిపి రూ.10 లక్షల నుంచి రూ.12.5 కోట్ల వరకు బీమా సౌకర్యం పొందవచ్చు. ఫోన్ పే యాప్‌లో ఎటువంటి పత్రాలు అవసరం లేకుండా పూర్తిగా డిజిటల్ విధానంలో నిమిషాల్లోనే ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ బీమా అగ్ని ప్రమాదం, వరదలు, భూకంపాలు, అల్లర్లు, దొంగతనం వంటి 20కి పైగా ఊహించని ప్రమాదాల నుంచి రక్షణనిస్తుంది.
జియో, ఎయిర్‌టెల్‌కు BSNL షాక్.. రోజుకు కేవలం రూ.5లతో అన్‌లిమిటెడ్ కాల్స్!
సాధారణంగా గృహ రుణంతో వచ్చే బీమా పాలసీల్లో ఉన్న పరిమితులను అధిగమిస్తూ.. మీ ఇంటిపై రుణం ఉన్నా.. లేకపోయినా.. అందరికీ అందుబాటులో ఉంటుంది. అంతేకాక, అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు గృహ రుణాల కోసం ఈ పాలసీని అంగీకరిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. ఫోన్ పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ సిఇఒ విశాల్ గుప్తా మాట్లాడుతూ.. “ప్రతి భారతీయుడికి తక్కువ ఖర్చుతో సులభమైన బీమా అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు.
