Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగిసింది.. నిన్నటితో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విచారణ పూర్తయింది. వారం రోజుల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది. విచారణలో ఆయన నోరు విప్పలేదు. కీలక సమాచారం ఏదీ ఇవ్వలేదని సిట్ తెలిసింది. నిబంధనల ప్రకారమే పనిచేశానని చెప్పినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అధికారుల ఆదేశాలతోనే చేశానని తెలిపారు. రాజకీయ నేతలు, బిజినెస్ మెన్, జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్‌పై స్పష్టత ఇవ్వలేదు. రివ్యూ కమిటీ అనుమతితోనే ట్యాపింగ్ జరిగిందని సమాధానమిచ్చారు.. హార్డ్‌డిస్కులు ధ్వంసం నిబంధనల ప్రకారమేనని చేశానన్నారు. ఈమెయిల్, క్లౌడ్ డేటాలో వ్యక్తిగత సమాచారం మాత్రమే డిలీట్ అయిందని తెలిపారు..
READ MORE: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
ట్యాపింగ్ డివైజ్‌లు అమెరికాలోనే మరిచి పోయినట్లు వెల్లడించారు. అసలు సూత్రధారులపై సమాచారం ఇవ్వలేదు. విచారణకు సంబంధించి పూర్తి వివరాలపై నివేదికను సిట్ సుప్రీంకోర్టుకు ఇవ్వనుంది. ప్రభాకర్ రావుకు ఇచ్చిన మధ్యంతర రక్షణ తొలగింపుపై సిట్ ఆలోచన చేస్తోంది. మధ్యంతర రక్షణ తొలగితే ప్రభాకర్ రావు అరెస్ట్ చేసే ఆలోచనలో సిట్ ఉంది. కాగా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో మరొక ప్రత్యేక సీట్ ఏర్పాటు చేశారు.. ప్రభుత్వం ఐదుగురు ఐపీఎస్ అధికారులతో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
READ MORE: Delhi Air Pollution: ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. వాయుకాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరి
