Site icon NTV Telugu

Petrol: ఎన్నికల వేళ వాహనదారులకు గుడ్‌న్యూస్.. ధరలు తగ్గించిన కేంద్రం

Petrol

Petrol

సార్వత్రిక ఎన్నికల వేళ వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పెట్రోలు, డీజిల్ ధరలు రూ. 2 తగ్గిస్తున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి వెల్లడించారు.

పెట్రోలు, డీజిల్ ధరలను రెండు రూపాయలు తగ్గించడంతో ప్రధాని మోడీ కోట్లాది మంది భారతీయుల సంక్షేమం కోరుకున్నారని మంత్రి తెలిపారు. తగ్గిన ధరలు మార్చి 15, ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది.

దేశ రాజధాని ఢిల్లీ లీటరు పెట్రోల్ ధర రూ.96.72 ఉండగా ఇప్పుడు రూజ 94.72 కి తగ్గించబడుతుంది. ఇక ఆయా నగరాలను బట్టి ఈ ధరలు తగ్గనున్నాయి.

త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా గెలిచేందుకు మోడీ సర్కార్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఆయా వర్గాలకు కేంద్రం తాయిలాలు ప్రకటిస్తోంది. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్ ధరను రూ.100కి తగ్గించింది.

అనంతరం పౌరసత్వ సవరణ చట్టానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ముస్లిమేతరులకు భారతదేశ పౌరసత్వం అనుగ్రహించింది. 2014కు ముందు వచ్చిన ముస్లిమేతరులు ఎవరైనా సరే ఎలాంటి పత్రాలు లేకుండా పౌరసత్వం ఇవ్వనుంది.

ఇప్పుడు తాజాగా వాహనదారులను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. గత కొద్ది రోజులుగా లీటర్ పెట్రోల్ రూ.110లకు విక్రయిస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ ధరలు దిగడం లేదు. ఎన్నికల వేళ వాహనదారులకు కొంచెం ఉపశమనం కలిగేలా లీటర్‌పై రూ.2లు తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది.

ఇదిలా ఉంటే శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను కూడా ఎన్నికల సంఘం బట్టబయలు చేసింది. వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. గురువారం కొత్త ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సంధూ, జ్ఞానేశ్‌ కుమార్‌ నియామకం జరిగింది.

మరోవైపు ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ.. కొత్త పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. తొలి జాబితాలో 195 మంది, రెండో జాబితాలో 72 మందిని బీజేపీ వెల్లడించింది. ఇక మూడో జాబితాపై కూడా కసరత్తు పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే విడుదల చేయనున్నారు.

 

Exit mobile version