ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి హత్యపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. సొంత అనుచరుడు హత్యకు గురి కావడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్థాపానికి గురి అయ్యారు.. జీవన్ రెడ్డి బాధలో ఉండి అలా మాట్లాడారని తెలిపారు. తాను జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడనని.. పోలీసులతో మాట్లాడినట్లు చెప్పారు. హత్య చేసిన నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.. హత్యపై విచారణ చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలని పోలీసులకు చెప్పానన్నారు. సీనియర్ మంత్రిగా శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి విషయాన్ని చూసుకుంటారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
Team India: డేంజరస్ బ్యాటర్లను అధిగమించిన టీమిండియా యువ బ్యాటర్..
మరోవైపు.. కాంగ్రెస్ కార్యకర్త మార గంగారెడ్డి మృతదేహానికి కాసేపటి క్రితం పోస్ట్‌మార్టం పూర్తయింది. అంత్యక్రియల కోసం గంగారెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఈ క్రమంలో.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జాబితాపూర్‌కు వచ్చారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కాగా.. ఉదయం గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. సంతోశ్ అనే వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీకొట్టాడు.. ఆ తర్వాత కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ గంగారెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఈ క్రమంలో.. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Ram Charan: ఆర్టీఏ ఆఫీసులో హీరో రామ్‌చరణ్.. ఏడున్నర కోట్ల కారుకు రిజిస్ట్రేషన్