Site icon NTV Telugu

PBKS vs MI: ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. టాప్‌-2 టార్గెట్!

Pbks Vs Mi

Pbks Vs Mi

ఐపీఎల్ 2025లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు జైపూర్ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఈ రెండు జట్లు.. టాప్‌-2లో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలో దిగనున్నాయి. ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో పట్టికలో 17 పాయింట్లతో పంజాబ్‌ రెండో స్థానంలో ఉంది. ముంబై 13 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టుకు టాప్‌-2లో స్థానం ఖరారు అవుతుంది. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.

ముంబై ఇండియన్స్‌పై పంజాబ్‌ కింగ్స్ గెలిస్తే దాదాపుగా అగ్ర స్థానం ఖరారు అవుతుంది. పంజాబ్‌కు నెట్‌ రన్‌రేట్‌ కాస్త ఎక్కువగా ఉండడంతో బెంగళూరు తన చివరి మ్యాచ్‌లో గెలిచినా.. రెండో స్థానంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్‌పై ముంబై గెలిస్తే కనీసం రెండో స్థానం ఖాయమవుతుంది. లక్నో చేతిలో బెంగళూరు ఓడితే మాత్రం ముంబైకి ఏకంగా అగ్రస్థానం దక్కుతుంది. నెట్‌ రన్‌రేట్‌లోనూ ముందు ఉండడం ముంబైకి కలిసొచ్చే అంశం. చూడాలి మరి ఈరోజటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారు?, టాప్‌-2లో ఎవరుంటారో.

Exit mobile version