Site icon NTV Telugu

IPL 2025: లక్నో స్పిన్నర్ దిగ్వేశ్‌ రాఠీకి మరో షాక్‌ తప్పదా?

Digvesh Rathi

Digvesh Rathi

ఐపీఎల్ 2025లో భారత స్పిన్నర్ దిగ్వేశ్‌ రాఠీ ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్‌లో ఇదే తొలి సీజన్‌ అయినా.. దిగ్గజ బ్యాటర్లను సైతం తన స్పిన్ మయాజాలంతో కట్టడి చేస్తున్నాడు. పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ లక్నో సూపర్ జెయింట్స్‌కు అండగా నిలిస్తున్నాడు. ఇతను ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. అయితే దిగ్వేశ్‌ తన బౌలింగ్ కన్నా.. సంబరాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. ఐపీఎల్‌ 2025లో ఇప్పటివరకు రెండుసార్లు జరిమానా ఎదుర్కొన్న దిగ్వేశ్‌కి మరో షాక్‌ తప్పేలా లేదు.

పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా దిగ్వేశ్‌ రాఠీ ‘నోట్‌బుక్’ సంబరాలు సోషల్ మీడియాలో మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యాయి. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను 13వ ఓవర్లో దిగ్వేశ్‌ ఔట్ చేశాడు. ఈ సీజన్‌లో అయ్యర్‌ను దిగ్వేశ్‌ అవుట్ చేయడం ఇదే మొదటిసారి. కీలక వికెట్ పడడంతో దిగ్వేశ్‌ నోట్‌బుక్ సంబరాలు చేసుకున్నాడు. ఇప్పటికే రెండుసార్లు నోట్‌బుక్ సంబరాలు చేసుకుని జరిమానా ఎదుర్కొన్నా.. మరోసారి అలానే చేశాడు. దిగ్వేశ్‌ మూడోసారి జరిమానా ఎదుర్కొనే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.

Exit mobile version