ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు.. తాజాగా సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది..దోస పై పాస్తా .. ఏంటి ఈ విచిత్రం అనుకుంటున్నారా.. ఒకసారి చూసేద్దాం పదండీ..
రకరకాల వెరైటీ దోసలను మనం చూస్తూనే ఉంటాం.. ఏదైనా స్పైసిగా ఉంటే బాగుంటుంది.. కానీ విచిత్ర కాంబినేషన్స్ తో దోస.. ఎలా ఉంటుందో ఊహించుకోండి..వింటుంటే బాబోయ్ అనిపిస్తుంది కదూ.. మీరు విన్నది నిజమే.. కారం వెయ్యాల్సిన దోస పై పాస్తా పనీర్ వేశారు.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది..ఒక ప్రాంతపు ఆహారాన్ని.. మరొక ప్రాంతం వారు తినడం ప్రారంభించారు. కొందరు వాటితో ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒక వింతైన టిఫిన్ కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ దోస గురించి విని దండం రా బాబు అంటున్నారు.. ఈ వీడియో నెట్టింట ఓ రేంజులో హల్ చల్ చేస్తుంది..
ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ టిఫిన్ సెంటర్ వ్యక్తి దోసను తయారు చేస్తున్నాడు. ప్లైన్ దోస పై ఉడికించిన పాస్తాను వేసి మెదిపీ పనీర్ వేసాడు… ఆపై కాసేపు కాలిన తర్వాత పైన మరోసారి పనీర్ తురుము, ఏవో ఆకులు వేసి బాగా కర్రిగా అయ్యేవరకు ఉంచాడు. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, దోస ను కూడా తీసుకున్నాడు.. పైన పనీర్ తురుమీ వేసాడు.. అయితే ఇప్పటి వరకూ ఇటువంటి దోసను తిని ఉండరు.. ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది. వీడియోను కూడా లైక్ చేసారు.. మొత్తానికి వీడియో ట్రెండ్ అవుతుంది..
