Site icon NTV Telugu

Paruchuri Gopala Krishna : భోళా శంకర్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన పరుచూరి…

Whatsapp Image 2023 10 08 At 4.19.25 Pm

Whatsapp Image 2023 10 08 At 4.19.25 Pm

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్.. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది.. మహానటి కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించిన సంగతి తెలిసిందే.హీరో సుశాంత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. భారీ అంచనాలతో ఆగస్టు 11 న విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా విడుదల తర్వాత చిరంజీవిపై అలాగే దర్శకుడు మెహర్ రమేష్ పై భారీగా ట్రోలింగ్స్ జరిగాయి. నెటిజన్స్ నెగటివ్ కామెంట్స్ తో రెచ్చిపోయారు. దర్శకుడు మెహర్ రమేష్ పై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.అయితే తాజాగా ఈ సినిమా పట్ల ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోళా శంకర్ అన్నా చెల్లెళ్ల కథ కాదు. చెల్లెలు కాని అమ్మాయిని తన చెల్లిగా భావించి ఆమె కోసం చేసే పోరాటమే ఈ చిత్ర కథ.నిజానికి ఇది అద్భుతమైన పాయింట్‌. ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ గా తెరకెక్కింది.

కోల్‌కతా బ్యాక్‌గ్రౌండ్‌లో తీసిన సినిమాలపై ప్రాంతీయత బాగా ప్రభావం చూపుతుంది.మన నేటివిటీ తగ్గట్టుగా సినిమాను మార్పు చేయాలి. అప్పుడే సగటు ప్రేక్షకుడికి సినిమా పై ఇంట్రెస్ట్ కలుగుతుంది..కానీ భోళా శంకర్‌ మొదట్లోనే ఇది కోల్‌కతా కథ అని చూపించారు. దీంతో ఇది మన కథ కాదనే భావన ప్రేక్షకుడికి, నాకు కలిగింది. తమిళ సినిమాలు రీమేక్‌ చేసినా మన ప్రాంతీయతకు తగ్గట్లు వాటిలో పూర్తి మార్పులు చేయాలి. కానీ, ఈ చిత్రబృందం ఆ విధంగా ఎందుకు మార్పులు చేయలేదో మాత్రం నాకు అర్థం కాలేదు. ఈ సినిమా ప్రధానంగా మానవ అక్రమ రవాణాను అణచివేసే హీరో కథ. భోళా శంకర్‌ మూవీ లో ఒకవైపు మాఫియాను అణచివేసే హీరోను చూపిస్తూనే మరోవైపు అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌ను చూపించారు. దీంతో రెండు పడవల మీద ప్రయాణం చేశారా అనే అనుమానం నాకు కలిగింది. దాన్ని ఇంకాస్త తెలివిగా చూపించవచ్చు. సినిమా రీమేక్ చేసే విషయంలో కొన్ని కీలక అంశాలు మార్పు చేయాలి లేకపోతే చూసిందే మళ్ళీ చూస్తున్న భావన ప్రేక్షకుడికి కలుగుతుందని ఆయన తెలిపారు.

Exit mobile version