PV Sindhu about Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ధీమా వ్యక్తం చేశారు. బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర చాలా మెళకువలు నేర్చుకున్నానని చెప్పారు. తానేంతో మెరుగయ్యానని, తన ఆటను కోర్టులో చూస్తారని సింధు పేర్కొన్నారు. 2016 రియోలో రజతం, 2020 టోక్యోలో కాంస్య పతకాలను సింధు సాధించిన విషయం తెగెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌లోనూ పతకం గెలిచి.. ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రికార్డు సృష్టించాలని చూస్తునారు. సింధు సహా రెజ్లర్ సుశీల్ కుమార్ మాత్రమే వ్యక్తిగత విభాగాల్లో రెండేసి పతకాలు నెగ్గారు.
పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ… ‘పతకం సాధించాలనే లక్ష్యం బరిలోకి దిగుతున్నా. స్వర్ణమా, రజతమా, కాంస్యమా అన్నది విషయం కాదు. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచాను. ఏ పతకం సాధించాలని ఆలోచించుకుంటూ ఒత్తిడి పెంచుకోను. ఒలింపిక్స్‌లో ఆడుతున్న ప్రతిసారి మొదటిసారి బరిలోకి దిగుతున్నాననే అనుకుంటా. ప్రతిసారి మెడల్ గెలవాలనే భావిస్తా. హ్యాట్రిక్ సాధిస్తానని నమ్మకంగా ఉన్నా. ప్రకాశ్ సర్ దగ్గర చాలా మెళకువలు నేర్చుకున్నా. ఇప్పుడు నేనెంతో మెరుగయ్యా. నా ఆటను కోర్టులో చూస్తారు’ అని అన్నారు.
Also Read: Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‌కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడుగా!
ఏడుగురు భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పారిస్ 2024 ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్నారు. బ్యాడ్మింటన్ పోటీలు జూలై 27న ప్రారంభమై.. ఆగస్టు 5 వరకు జరుగుతాయి. ఐదు ఈవెంట్‌లలో పోటీలు జరగనున్నాయి. పురుషులు, మహిళల సింగిల్స్.. పురుషులు, మహిళల డబుల్స్.. మిక్స్‌డ్ డబుల్స్ పోటీలు ఉంటాయి. మొత్తం 172 మంది టాప్ షట్లర్లు పాల్గొంటారు. ఇటీవలి కాలంలో ఎక్కువగా గాయాల పాలైన సింధు ఎలా రాణిస్తుందో చూడాలి.