NTV Telugu Site icon

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్.. లక్ష్యసేన్‌ సాధించేనా?

Lakshya Sen

Lakshya Sen

Paris Olympics 2024 India Schedule Today: పారిస్ ఒలింపిక్స్‌ 2024లో షూటింగ్ మిన‌హా మిగిలిన భార‌త అథ్లెట్లు నిరాశ‌ప‌రుస్తున్నారు. పతకాలు తెస్తారనుకున్న పీవీ సింధు, నిఖ‌త్ జ‌రీన్‌తో పాటు ప‌లువురు స్టార్ అథ్లెట్లు ఇప్ప‌టికే ఇంటి ముఖం ప‌ట్టారు. మ‌ను భాక‌ర్‌ ‘హ్యాట్రిక్’ కొద్దిలో మిస్ అయింది. ఇక ఇప్పుడు అందరి ఆశలు స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌పైనే ఉన్నాయి. ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌ చేరుకుని చరిత్ర సృష్టించిన అతడు బంగారం లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. ఆదివారం జరిగే పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో ఒలింపిక్‌ ఛాంపియన్‌ విక్టర్‌ అక్సెల్సెన్‌ (డెన్మార్క్‌)తో లక్ష్యసేన్‌ తలపడనున్నాడు.

గత కొన్నేళ్లుగా ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న అక్సెల్సెన్‌తో పోరు లక్ష్యసేన్‌కు సవాలే అని చెప్పాలి. అక్సెల్సెన్‌ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2016 రియోలో కాంస్యం సాధించాడు. 2017, 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో విన్నర్. 2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన లక్ష్యసేన్‌.. అక్సెల్సెన్‌ చేతిలో ఏడు సార్లు ఓడిపోయాడు. 2022 జర్మన్‌ ఓపెన్‌లో మాత్రమే అక్సెల్సెన్‌పై మనోడు పైచేయి సాధించాడు. అక్సెల్సెన్‌పై గెలిచి పతకం ఖాయం చేసుకోవాలని భారత ఫాన్స్ కోరుకుంటున్నారు.

భారత్ షెడ్యూల్ ఇదే:
# బ్యాడ్మింటన్‌: పురుషుల సింగిల్స్‌ సెమీస్‌ (లక్ష్యసేన్‌ × అక్సెల్సెన్‌)- మధ్యాహ్నం 3.30
# గోల్ఫ్‌: పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే (శుభాంకర్, గగన్‌జీత్‌)- మధ్యాహ్నం 12.30
# అథ్లెటిక్స్‌: మహిళల 3000మీ.స్టీపుల్‌ఛేజ్‌ తొలి రౌండ్‌ (పారుల్‌)- మధ్యాహ్నం 1.35, పురుషుల లాంగ్‌జంప్‌ క్వాలిఫికేషన్‌ (జెస్విన్‌ అల్డ్రిన్‌)- మధ్యాహ్నం 2.30
# సెయిలింగ్‌: డింగీ రేస్‌ పురుషులు (విష్ణు)- మధ్యాహ్నం 3.35, మహిళలు (నేత్ర)- సాయంత్రం 6.05
# బాక్సింగ్‌: మహిళల 75 కేజీల క్వార్టర్స్‌ (లవ్లీనా × క్వియాన్‌)- మధ్యాహ్నం 3.02
# హాకీ: పురుషుల క్వార్టర్స్‌ (భారత్‌ × బ్రిటన్‌)- మధ్యాహ్నం 1.30
# షూటింగ్‌: పురుషుల 25మీ.ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ (విజయ్‌వీర్, అనీశ్‌)- మధ్యాహ్నం 12.30, స్కీట్‌ మహిళల క్వాలిఫికేషన్‌ (రైజా, మహేశ్వరి)- మధ్యాహ్నం 1

 

Show comments