NTV Telugu Site icon

Paris Olympics 2024: నేటి భారత షెడ్యూల్ ఇదే.. మూడో పతకం ఖాయమేనా!

Paris Olympics 2024 India

Paris Olympics 2024 India

Paris Olympics 2024 India Schedule Today: పారా ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్లు దూసుకుపోతున్నారు. ఇప్పటికే షూటింగ్ విభాగంలో రెండు 2 పతకాలు రాగా.. బుధవారం మనోళ్లు సత్తాచాటారు. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, లక్ష్యసేన్ ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించారు. టేబుల్ టెన్నిస్‌లో తెలంగాణ అమ్మాయి శ్రీజ ఆకుల ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. బాక్సింగ్‌లో లోవ్లినా బర్గోహైన్ క్వార్టర్ ఫైనల్ చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచింది. షూటింగ్‌లో స్వప్నిల్ కుసాలే ఫైనల్‌కు అర్హత సాధించగా.. ఆర్చర్ దీపికా కుమారి ప్రీక్వార్డర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

నేడు (ఆగష్టు 1) భారత్ అథ్లెట్లకు కీలకమైన ఈవెంట్స్ ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం 1.00 గంటలకు షూటింగ్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో స్వప్నిల్ కుసాలే ఫైనల్‌లో తలపడనున్నాడు. అతను దేశానికి మూడో పతకం సాధించే అవకాశం ఉంది. బాక్సర్ నిఖత్ జరీన్ మహిళల 50 కేజీల విభాగంలో చైనా బాక్సర్ వు యుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నిఖత్ విజయం సాధిస్తే మెడల్ సాధించేందుకు మార్గం సుగుమమవుతోంది. ఆరోరోజు భారత్ పూర్తి షెడ్యూల్ తెలుసుకుందాం.

గోల్ఫ్:
పురుషుల వ్యక్తిగత ఫైనల్: గగంజీత్ భుల్లర్ మరియు శుభంకర్ శర్మ – మధ్యాహ్నం 12.30.

షూటింగ్:
పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ (ఫైనల్): స్వప్నిల్ కుసలే – మధ్యాహ్నం 1.00 గంటలకు
మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ (క్వాలిఫికేషన్): సిఫ్ట్ కౌర్ సమ్రా మరియు అంజుమ్ మౌద్గిల్ – మధ్యాహ్నం 3.30.

హాకీ:
భారత్ vs బెల్జియం (గ్రూప్ స్టేజ్ మ్యాచ్): మధ్యాహ్నం 1.30.

బాక్సింగ్:
మహిళల ఫ్లైవెయిట్ (ప్రీ-క్వార్టర్ ఫైనల్స్): నిఖత్ జరీన్ vs యు వు (చైనా) – మధ్యాహ్నం 2.30.

ఆర్చరీ:
పురుషుల వ్యక్తిగత (1/32 ఎలిమినేషన్): ప్రవీణ్ జాదవ్ vs కావో వెంచావో (చైనా) – మధ్యాహ్నం 2.31
పురుషుల వ్యక్తిగత (1/16 ఎలిమినేషన్): మధ్యాహ్నం 3.10.

టేబుల్ టెన్నిస్:
మహిళల సింగిల్స్ (క్వార్టర్ ఫైనల్స్): మధ్యాహ్నం 1.30 నుంచి.

రోయింగ్:
పురుషుల డింగీ రేస్ 1: విష్ణు శరవణన్: మధ్యాహ్నం 3.45 గంటలకు
మహిళల డింగీ రేస్ 1: నేత్ర కుమనన్: రాత్రి 7.05 గంటలకు