NTV Telugu Site icon

Luana Alonso: నెయ్‌మర్ నుంచి ప్రైవేట్‌ మెసేజ్‌ వచ్చింది.. బాంబ్ పేల్చిన ఒలింపిక్స్‌ బ్యూటీ!

Luana Alonso

Luana Alonso

Luana Alonso About Neymar Junior: పారిస్ ఒలింపిక్స్‌ 2024 నుంచి పరాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సోను బయటకు పంపించిన సంగతి తెలిసిందే. స్విమ్‌ సూట్‌లతో కనిపిస్తూ తోటి క్రీడాకారులను ఇబ్బందికి గురిచేసిందనే కారణంతో ఒలింపిక్స్‌ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనతో లువానా ‘ఒలింపిక్స్‌ బ్యూటీ’గా మారిపోయారు. ఆమెకు ప్రస్తుతం ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ భారీ స్థాయిలో ఉంది. ఒక్క వారంలోనే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 5 లక్షలు పెరిగారు. అయితే లువానా తాజాగా ఓ బాంబ్ పేల్చారు.

స్టార్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్ నెయ్‌మర్ జూనియర్ తనకు ప్రైవేట్‌గా మెసేజ్‌ చేసినట్లు లువానా అలోన్సో తెలిపారు. ‘బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ నెయ్‌మర్ జూనియర్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌ చేశాడు. ఇదొక్కటి మాత్రమే చెప్పగలను. ఏం మెసేజ్‌ చేశాడన్నది మాత్రం చెప్పలేను. తడి విజ్ఞప్తి మేరకు వదిలేశా. ఈ విషయం గురించి ఇంకేం చెప్పను’ అని అలోన్సో పేర్కొన్నారు. నెయ్‌మర్ జూనియర్ ఏం మెసేజ్‌ చేసుంటాడో ఇప్పటికే అందరికీ అర్ధమైపోయుంటుంది.

Also Read: AC in Car: ఓ గంట పాటు కారులో ఏసీ ఆన్ చేస్తే.. ఎంత పెట్రోల్ అయిపోతుందో తెలుసా?

పారిస్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న 20 ఏళ్ల లువానా లోన్సో.. స్విమ్మింగ్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి అందరిని షాక్‌కు గురిచేశారు. ఒలింపిక్స్‌లో చోటుచేసుకున్న వివాదంపై ఆమె స్పందించారు. తననెవరూ క్రీడా గ్రామం నుంచి పంపించలేద, దయచేసి అసత్యపు వార్తలను ప్రచారం చేయొద్దని కోరారు. 2004లో పరాగ్వేలో జన్మించిన లువానా.. పారిస్ ఒలింపిక్స్‌ 100 మీటర్ల మహిళా బటర్‌ఫ్లై సెమీఫైనల్స్‌ పోటీల్లో ఓడిపోయారు. 17 ఏళ్ల వయసులో 2020 ఒలింపిక్స్‌లో పాల్గొన్న లువానా 28వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు 6వ స్థానంతో పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించారు.

 

Show comments