NTV Telugu Site icon

Viral Video: నెట్టింటిని షేక్ చేస్తున్న పాన్ దోస.. ఇదేక్కడి విడ్డూరం రా బాబు..!

Pan Dosa

Pan Dosa

సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ కాంబినేషన్‌లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. కొన్ని కాంబినేషన్లను చూస్తుంటే భయపెడుతున్నాయి. తాజాగా పాన్ దోస తయారు చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన జనం తయారు చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయులు ఎంతో ఇష్టపడే వాటిలో దోస ఒకటి.. క్రిస్పీగా, కరకరలాడేలా ఉంటే దీన్ని మరింతగా తింటుంటారు. మసాలా దోస, ఉప్మా దోస, రవ్వ దోస ఇలా వెరైటీల గురించి అందరికీ తెలుసు కానీ.. ఇప్పుడు మరో ‘పాన్ దోస’ వైరల్ గా మారింది. ఈ విచిత్రమైన కాంబినేషన్ ఏంటని? భయపడుతున్నారు కదూ.. @happyfeet_286 అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి పాన్ దోసను తయారు చేశాడు.

Also Read: Online Fraud: అమ్మాయి అడిగిందని న్యూడ్ ఫోటోలు పంపాడు.. తీరా చూస్తే?

ఓ వ్యక్తి తమలపాకులు యాడ్ చేసిన ఆకుపచ్చని రంగు పిండిని వేడిగా ఉన్న పెనంపై పోశాడు. కొన్ని సెకండ్ల తర్వాత దానిపై వెన్న రాసి.. తరువాత తరిగిన పాన్, చెర్రీస్, ఎండు ద్రాక్ష, ఆప్రికాట్లు, ఖర్జూరాలు, అత్తి పండ్లు, టూటీ ఫ్రూటీ మరియూ డ్రై ఫ్రూట్లు ఇవన్నీ కలిపిన పేస్ట్‌ను దోసపై వేసి.. అవన్నీ కలిసేలా దోసను తయారు చేశాడు. ఈ దోస చూసేవారిని షాక్‌కి గురి చేసింది. ఏంటీ ఈ విచిత్రమైన కాంబినేషన్ ఇలాంటివి మనకు అవసరమా? అని నెట్టింట జనం మండిపడుతున్నారు. ఈ వీడియో షేర్ చేసిన వ్యక్తి ‘ఈ గ్రహాన్ని వదిలిపెట్టి వెళ్లే సమయం ఆసన్నమైంది అనే క్యాప్షన్ తో పోస్టు చేసారు. ఇక నెటిజన్లు ఈ దోసపై విభిన్న రితీలో రియాక్ట్ అవుతున్నారు.

Also Read: Nitin Gopi: ఇండస్ట్రీలో విషాదం.. కన్నడ స్టార్ నటుడు హఠాన్మరణం