Female Suicide Bomber: నొకుండిలోని ఫ్రాంటియర్ కార్ప్స్ (FC) ప్రధాన కార్యాలయంపై జరిగిన తాజా దాడి పాకిస్థాన్ భద్రతా వ్యవస్థను కుదిపేసింది. ఈ దాడికి బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) బాధ్యత వహించింది. తాజాగా పాకిస్థాన్ FC ప్రధాన ద్వారం వద్ద తనను తాను పేల్చుకున్న మహిళా ఆత్మాహుతి బాంబర్ జరీనా రఫిక్ అలియాస్ తరంగ్ మహో ఫోటోను పాక్ అధికారులు విడుదల చేశారు. ఈ ఫోటోలో ఆమె ధరించిన జాకెట్‌లో మూడు బాంబులు కనిపిస్తున్నాయి. పేలుడు తర్వాత, కాల్పుల మోత చాలా సేపు కొనసాగింది. ఈ ఘటన మొత్తం నొకుండి ప్రాంతాన్ని కుదిపేసింది. ఈ దాడిలో మరణించిన వారి సంఖ్యను ఇంకా భద్రతా సంస్థలు అధికారికంగా విడుదల చేయలేదు.
దాడికి బాధ్యత వహించిన BLF
దాడి జరిగిన తర్వాత మొదట్లో ఈ దాడికి ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. కానీ తర్వాత బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) దీనికి బాధ్యత వహించింది. ఈ ఉగ్రసంస్థ ఉప యూనిట్లలో ఒకటి ఈ భారీ దాడిని నిర్వహించిందని పేర్కొంది. నొకుండిలోని రెకో డిక్, సందక్ మైనింగ్ ప్రాజెక్టులలో పనిచేస్తున్న విదేశీ కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ సందర్భంగా పాక్ దర్యాప్తు బృందం దాడికి పాల్పడిన మహిళ ఉగ్రవాది ఫోటోను తాజాగా విడుదల చేసింది. ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడిన మహిళను జరీనా రఫీక్ అలియాస్ తరంగ్ మహోగా గుర్తించారు. ఆమె నొకుండిలోని FC ప్రధాన కార్యాలయ ప్రవేశద్వారం వద్ద తనను తాను పేల్చివేసుకుందని తెలిపారు.
ఈ దాడిలో మహిళల ప్రమేయం బయటపడటంతో బలూచ్ మహిళలు ఎందుకు ఇలాంటి ప్రమాదకరమైన దాడుల్లో పాల్గొంటున్నారనే ప్రశ్నను మరోసారి లేవనెత్తింది. స్థానిక మానవ హక్కుల కార్యకర్తలు, విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ ఉగ్రసంస్థలో బలూచ్ మహిళలు పాల్గొనడాన్ని ఆత్మహత్య చర్యగా లేదా ఆర్థిక ఒత్తిడి ఫలితంగా చూడకూడదని అన్నారు. ఈ మహిళలు తమ గొంతులను పెంచుతూ, తప్పిపోయిన తమ సోదరీమణులు, సోదరులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇందులో చేరుతున్నారని పేర్కొన్నారు. బలూచ్‌లో అనేక కుటుంబాలు సంవత్సరాలుగా అదృశ్యాలు, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ఫిర్యాదు చేస్తున్నాయి. కానీ ఎలాంటి న్యాయం జరగనప్పుడు వాళ్లు ఇలాంటి విపరీతమైన చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు.
గత 24 గంటల్లో బలూచిస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో దాడులు తీవ్రమయ్యాయి. వేర్పాటువాద గ్రూపులు అనేక ప్రదేశాలలో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని IED పేలుళ్లు, ఆకస్మిక దాడులు, చెక్‌పోస్టులపై దాడులు చేశాయి. కఠినమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, ఈ గ్రూపులు టార్గెట్ చేసుకున్న చోట, ఎప్పుడైనా దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఈ దాడులు నిరూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. చాగై జిల్లా ప్రపంచంలోనే అతిపెద్ద ఉపయోగించని రాగి-బంగారు నిల్వలలో ఒకటైన రెకో డిక్‌కు నిలయం. పాకిస్థాన్ మైనింగ్, పెట్టుబడి ప్రణాళికలలో ఈ ప్రాజెక్ట్ కీలకమైనదిగా చెబుతున్నారు. ప్రస్తుతం నొకుండిలో కొనసాగుతున్న ఘర్షణ ఈ ప్రాంతంలో ఉద్రిక్తతను, భద్రతను పెంచిందని విశ్లేషకులు అంటున్నారు.
READ ALSO: Epic Movie Glimpse: ఆసక్తికరంగా ‘ఎపిక్’ గ్లింప్స్.. చూశారా!
🚨🪖🇵🇰💥 Update:
BLF released the pic of woman rebel Zareena Rafiq alias Tranag Maho who detonated herself at the entry point of the main FC headquarters compound in Nokkundi, Balochistan : Source https://t.co/gwvYEYgIin pic.twitter.com/6OuobsZREV
— OsintTV 📺 (@OsintTV) December 1, 2025
