Site icon NTV Telugu

Holi Festival: పాక్ యూనివర్శిటీల్లో హోలీ నిషేధం..కారణం ఇదే ?

Holi

Holi

Holi Festival: ఇస్లామిక్ గుర్తింపును కాపాడేందుకు దేశంలోని విద్యాసంస్థల్లో హోలీ, ఇతర హిందూ పండుగలను జరుపుకోవడాన్ని పాకిస్థాన్ నిషేధించింది. దీని వల్ల తమ ఇస్లామిక్ గుర్తింపు ప్రమాదంలో పడుతుందని పాకిస్థాన్ భయపడుతోంది. హోలీ, ఇతర హిందూ పండుగలను జరుపుకునే అనేక వీడియోలు పాకిస్తాన్‌లో వెలువడ్డాయి. ఇప్పుడు పాకిస్థాన్ విద్యా శాఖ ఈ కఠిన చర్య తీసుకుంది. తమ విశ్వాసం ఇస్లాం మతంపై మాత్రమే ఉందని, మైనారిటీలపై తమ దౌర్జన్యాలు కొనసాగుతాయని పాకిస్థాన్ మరోసారి రుజువు చేసింది. హిందూ, సిక్కు జనాభాకు వ్యతిరేకంగా ఇది పెద్ద చర్యగా పరిగణించబడుతుంది.

Read Also:CM KCR: తెలంగాణలో పరిస్థితి తారుమారు అయ్యింది.. మోసపోతే గోసపడతాం

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లోని ఉన్నత విద్యా కమిషన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మన సామాజిక-సాంస్కృతిక విలువలకు, దేశ ఇస్లామిక్ గుర్తింపుకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను చూడడం బాధాకరమని కమిషన్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇస్లామాబాద్ క్యాంపస్‌లో పాకిస్తాన్‌లోని క్వాయిడ్-ఎ-అజామ్ విశ్వవిద్యాలయానికి చెందిన వందలాది మంది విద్యార్థులు హోలీ వేడుకలు జరుపుకున్నారు. ప్రజలు రంగులు అద్దుకుని కనిపించారు. ఇలాంటి వీడియోలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని పాకిస్థాన్ కమిషన్ పేర్కొంది. ప్రజలు అధికంగా పాల్గొనడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఈ తాలిబాన్ డిక్రీపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్‌లో మతపరమైన హింసకు సంబంధించిన అనేక కేసులు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు పాకిస్థాన్ తుగ్లక్ ఉత్తర్వు మానవ హక్కుల సంస్థలను మరోసారి ఆందోళనకు గురి చేసింది.

Read Also:JNVST 2023 Results : జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..

Exit mobile version