PACL Scam: కంపెనీలు పెట్టడం, వేల కోట్ల డబ్బులు ప్రజల నుంచి మాయమాటలు చెప్పి సేకరించడం తర్వాత వాటితో ఉడాయించడం ఈ రోజుల్లో కొందరికి సర్వసాధారణమైంది. పైసాపైసా కూడబెట్టి పొగు చేసుకుంటున్నామని అనుకుంటున్న సమయంలో చెప్పా పెట్టకుండా మాయం అవుతున్నారు కొందరు. అచ్చం అలాంటి సంఘటనే ఇది కూడా. పెరల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ (PACL) కంపెనీ 25 అక్టోబర్ 2011న ROC రాజస్థాన్‌లో రిజిస్టర్ చేశారు. న్యూఢిల్లీలోని బారా ఖంభా రోడ్లో ఈ కంపెనీ కార్పొరేట్ కార్యాలయం ఉంది. కంపెనీ డైరెక్టర్ గిల్, ఇతర ఆపరేటర్లు UPతో సహా 10 రాష్ట్రాల్లో కంపెనీ శాఖలను తెరిచారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే ఉంది. కానీ ఇక్కడే ఓ తిరకాసుకు తెర తీశారు.. చిన్నగా పెట్టుబడుల పేరుతో ప్రజల డబ్బును పెద్ద మొత్తంలో సేకరించి, రూ.49 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు.
READ ALSO: Ghalib al-Rahwi: ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడి.. హౌతి ప్రధాని మృతి?
కంపెనీ డైరెక్టర్ అరెస్ట్..
పెరల్స్ ఆగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ (PACL) కంపెనీ డైరెక్టర్ గుర్జంత్ సింగ్ గిల్‌పై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో EOW (ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ వింగ్) అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. ఈ కంపెనీ బ్యాంకింగ్ కార్యకలాపాలను నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC)గా నమోదు చేసుకోకుండానే ప్రారంభించిందన్నారు. ఇది UPలోని మహెూబా, సుల్తాన్పూర్, ఫరూఖాబాద్, జలౌన్ జిల్లాల్లో శాఖలను ప్రారంభించి, RD, FDల రూపంలో ప్రజల నుంచి డబ్బును సేకరించింది. ప్లాట్ల హామీతో ప్రజలను ఆకర్షించి, భారీగా పెట్టుబడులు పెట్టించారన్నారు. పెట్టుబడిదారులకు ప్లాట్లు ఇవ్వకపోవడమే కాకుండా వారు డిపాజిట్ చేసిన డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదన్నారు. ఈ విధంగా కంపెనీ దేశవ్యాప్తంగా దాదాపు రూ.49,000 కోట్లు సేకరించి, దానిని దుర్వినియోగం చేసిందన్నారు. జలాన్ జిల్లాలోని PACL బ్రాంచ్లో లక్షల రూపాయల దుర్వినియోగం జరిగిందనే ఫిర్యాదుపై EOW దర్యాప్తు ప్రారంభించింది. కాన్పూర్ పోలీస్ స్టేషన్లో ఈ కంపెనీ నిర్వహకులపై 409, 420, 467, 468, 471, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.
READ ALSO: Spy Caught With Lemon: గూఢచారిని పట్టించిన నిమ్మకాయ.. మరణశిక్షతో ముగిసిన జీవితం
