45-Year-Old Man Marries 6-Year-Old Girl: ఆఫ్ఘనిస్తాన్ వంటి కొన్ని దేశాలలో బాల్య వివాహాలు కొత్తేం కాదు. అయితే, ఇటీవల ఇక్కడ ఓ బాల్య వివాహ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని హెల్మండ్ ప్రావిన్స్‌లో 45 ఏళ్ల వ్యక్తి ఆరేళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. ఆ బాలిక పెళ్లికూతురుగా మారిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆఫ్ఘాన్ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. విషయం పెద్ద ఎత్తున వ్యాపించడంతో బాలిక తండ్రి, వరుడిని అరెస్టు చేశారు. అయితే.. వారిపై ఎటువంటి కేసు నమోదు కాలేదు.
తాలిబన్ ప్రభుత్వం ఇప్పటి వరకు బాల్య వివాహాలకు సంబంధించి ఎటువంటి చట్టాన్ని రూపొందించలేదు. వివాహానికి చట్టబద్ధమైన కనీస వయస్సు నిర్ణయించలేదు. కానీ.. ప్రస్తుతం ఆ బాలికను అతడి వెంట తీసుకెళ్లకుండా ఆపారు. అయితే.. తొమ్మిది సంవత్సరాల వయసు దాటిన తరువాత ఆ బాలికను ఆ వ్యక్తి వద్దకు పంపవచ్చని ప్రభుత్వం చెప్పింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఆ వ్యక్తి ఇప్పటికే రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. బాలిక కుటుంబీకులకు నగదు ఇచ్చి మూడో వివాహానికి ఒప్పించాడు. ఇదిలా ఉండగా.. 2021లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బాల్య వివాహాల కేసులు వేగంగా పెరిగాయని ఓ నివేదిక తెలిపింది. తాలిబన్ పాలనలో బాల్య వివాహాలు 25 శాతం వరకు పెరిగాయని యూఎన్ మహిళలు నివేదించారు. అదే సమయంలో.. UNICEF అంచనా ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బాల వధువులను కలిగిన దేశంగా ఉంది.
READ MORE: Narayanan Murthy : అణుబాంబు కన్నా ప్రమాదమే.. ఆర్.నారాయణ మూర్తి షాకింగ్ కామెంట్స్..
