Site icon NTV Telugu

OTT Release Movies: ఒక్కరోజే 15 మూవీస్.. ఆ రెండు సినిమాలు..!

Ottreleasesthisweek

Ottreleasesthisweek

థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలకన్నా కూడా ఓటీటి సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.. జనాలు ఈ మధ్య ఎక్కువగా వీటినే చూస్తున్నారు.. తక్కువ ఖర్చుతో ఇంటిల్లి పాధి కలిసి చూడొచ్చు.. ప్రతి వారం వీకెండ్ వచ్చిందంటే చాలు.. సినిమాల జాతర మొదలైనట్లే.. ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో సినిమాలో ఓటీటి ప్లాట్ ఫాంలలో విడుదల అవుతున్నాయి.. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటిలో సినిమాల సందడి ఉంది.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల లిస్ట్ ఒకసారి చూద్దాం..

ఈ వీకెండ్ బయటకు వెళ్లలేని పరిస్థితి.. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఆగకుండా కురుస్తున్నాయి..ఇంట్లోనే కూర్చుని చిల్ అవ్వాలి. అలా కావాలంటే ఎంటర్ టైన్‌మెంట్ కావాలి. ఇందులో భాగంగా ఈ శుక్రవారం ఏకంగా 15 సినిమాలు-వెబ్ సిరీసులు ఓటీటీల్లో రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. వీటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్‌తో పాటు డబ్బింగ్ చిత్రాలు-సిరీసులు కూడా ఉన్నాయండోయ్. వీటిలో ‘అశ్విన్స్’, ‘ధూమమ్’ సినిమాలను కూడా చూడొచ్చు.. ఏ సినిమాలు ఎక్కడ విడుదల అవుతున్నాయో చూడండి..

నెట్‌ఫ్లిక్స్..

దే క్లోన్డ్ టైరోన్ – ఇంగ్లీష్ చిత్రం
స్వీట్ మంగోలియన్స్ సీజన్ 3 – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
అశ్విన్స్ – తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
రేవన్ సాంగ్ – అరబిక్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)

అమెజాన్ ప్రైమ్..
ధూమమ్ – తెలుగు డబ్బింగ్ సినిమా
బవాల్ – హిందీ మూవీ
అన్‌స్టాపబుల్ – తెలుగు చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్)
గాయ్ రిచ్చీస్ ద కోవనెంట్ – ఇంగ్లీష్ సినిమా

ఆహా..
నచ్చింది గర్ల్‪ఫ్రెండూ – తెలుగు సినిమా
నేను సూపర్ ఉమెన్ – బిజినెస్ రియాలిటీ షో

జీ5..
మౌరా – పంజాబీ చిత్రం
జియో సినిమా
ట్రయల్ పీరియడ్ – హిందీ మూవీ
చాంద్ లో – గుజరాతీ సినిమా- జూలై 22
స్పెషల్ ఊప్స్: లయనెస్ – ఇంగ్లీష్ సిరీస్ – జూలై 23
దో గుబ్బారే – హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్).. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాను ఇక్కడ చూసేయ్యండి..

Exit mobile version