NTV Telugu Site icon

Oscars 2024: ఆస్కార్ కు 12 సినిమాలు నామినేట్.. తెలుగులో స్టార్ హీరో సినిమా..

Oscar

Oscar

సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులలో ఆస్కార్ పురస్కారాలు ఒకటి.. సినీ నటీనటులు తన నటన ద్వారా అందరిని మెప్పించి ఈ అవార్డులను అందుకోవాలని భావిస్తుంటారు.. నామినేషన్లలో అర్హత సాధించినా గొప్ప విషయంగానే భావిస్తారు. ఈ పురస్కారాలకు ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ అలాంటిది మరి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లోని చిత్రపరిశ్రమలు ఈ అవార్డ్స్ కోసం పోటీపడుతుంటాయి. ఇప్పటివరకు భారత్ నుంచి పలు చిత్రాలు, నటీనటులు ఆస్కార్ అవార్డ్స్ కోసం నామినేట్ అయ్యారు..

ఆయన మరెవ్వరో కాదు.. రఘుబీర్ యాదవ్. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అతను.. ఈయన ఏకంగా 8 సార్లు అవార్డును అందుకున్నారు.. గత ఏడాది చూస్తే మన తెలుగు సినిమా త్రిపుల్ ఆర్ ఈ అవార్డును సొంతం చేసుకుంది.. మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి, రచయిత సుభాష్ చంద్రభోస్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.. నాటు నాటు పాటకు ఈ పురస్కారాలు అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ ఏడాది ఆస్కార్ సందడి మొదలైంది. ఆస్కార్ 2024కి భారతదేశం నుంచి పలు చిత్రాలను ఎంపిక చెయ్యనున్నారు.. ఇప్పటివరకు ఆస్కార్ కు నామినేట్ అయిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం..

ది స్టోరీటెల్లర్ (హిందీ)
సంగీత పాఠశాల (హిందీ)
శ్రీమతి ఛటర్జీ vs నార్వే (హిందీ)
డంకీ (హిందీ)
12th ఫెయిల్ (హిందీ)
విడుతలై పార్ట్ 1 (తమిళం)
ఘూమర్ (హిందీ)
దసరా (తెలుగు).
జ్విగాటో (హిందీ)
రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (హిందీ)
కేరళ కథ (హిందీ).
2018 (మలయాళం), మరిన్ని..

ఇదే జాబితాలో వాల్వి (మరాఠీ), గదర్ 2 (హిందీ), అబ్ తో సబ్ భగవాన్ భరోస్ (హిందీ), బాప్ లియోక్ (మరాఠీ) వంటి చిత్రాలు ఉండే అవకాశం. ఇంకా సినిమాల లిస్ట్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది..