Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్‌కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..

Oppo

Oppo

స్మార్ట్‌ఫోన్ రంగంలో ఇప్పుడు కేవలం కెమెరా, ప్రాసెసర్‌లపైనే కాకుండా భారీ బ్యాటరీలపై కూడా కంపెనీలు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పో (OPPO) సంస్థకు చెందిన ‘ఒప్పో A7 ప్రో మాక్స్’ అనే సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందే టెక్ మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది. లీకైన సమాచారం ప్రకారం, ఈ ఫోన్‌లో ఏకంగా 10,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే, ఒప్పో యొక్క ‘A’ సిరీస్‌లోనే అత్యంత పెద్ద బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా ఇది సరికొత్త రికార్డు సృష్టిస్తుంది.

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, వినియోగదారులకు ఛార్జింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 80W సూపర్ ఊక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఇందులో ఇవ్వనున్నారు. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. అలాగే ఈ భారీ బ్యాటరీ కారణంగా ఫోన్ మరీ లావుగా ఉండకుండా, కేవలం 8.47 మిమీ మందం, 226 గ్రాముల బరువుతో స్లిమ్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 1.5K రిజల్యూషన్ కలిగిన 6.78 ఇంచుల ఫ్లాట్ OLED డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. పనితీరు కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 (Snapdragon 4 Gen 5) చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇక కెమెరా విభాగంలో, వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా, 2MP సెకండరీ కెమెరాతో కూడిన డ్యూయల్ సెటప్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP కెమెరా ఉండే అవకాశం ఉంది. ఒప్పో సంస్థ ఈ ఫోన్ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.