NTV Telugu Site icon

Operation Valentine :వాఘా సరిహద్దులో ‘వందేమాతరం’..ఇలా చేయడం ఇదే తొలిసారి..

Whatsapp Image 2024 01 15 At 12.12.10 Am

Whatsapp Image 2024 01 15 At 12.12.10 Am

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’. వైమానిక దాడులు, ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ కు సంబంధించిన కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది..ఈ చిత్రం తెలుగు మరియు హిందీ భాషల్లో నిర్మితమవుతోంది. బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.. శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు మరియు టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ ప్రమోషన్స్ గ్రాండ్ గా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.‘ఆపరేషన్ వాలంటైన్’ మూవీ ఫిబ్రవరి 16, 2024న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో సుఖ్వీందర్ సింగ్ పాడిన ‘వందేమాతరం’ అనే పాటను వాఘా సరిహద్దు లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

రిపబ్లిక్ డే సందర్భంగా వాఘా సరిహద్దులో భారత్, పాక్ సైనికుల కవాతు నిర్వహిస్తారు. ఈ వేడుకలో పాల్గొనున్న చిత్రబృందం, అక్కడే ‘వందేమాతరం’ పాటను విడుదల చేయనున్నారు. వాఘా సరిహద్దులో ఓ సినిమా పాటను విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. మిక్కి జే మేయర్ ఈ పాటను స్వరపరిచారు. తెలుగులో ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడగా, హిందీలో సుఖ్వీందర్ సింగ్ ఆలపించారు.ఈ సినిమాను భారత వైమానికి దాడులకు సంబంధించిన కొన్ని యథార్థ సంఘటనలను బేస్ చేసుకుని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల విడుదలైన టీజర్ కూడా ఎంతో ఆసక్తిగా సాగి సినిమాపై అంచనాలు పెంచేసింది.. “మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్ ది కూడా” అంటూ ఎయిర్ ఫోర్స్ కమాండర్ గా వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. శక్తి ప్రతాప్ సింగ్ ఈ మూవీతోనే దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.