Site icon NTV Telugu

Ooru Peru Bhairavakona X Review: ‘ఊరు పేరు భైరవకోన ‘ సినిమా హిట్ కొట్టినట్లేనా?

Ooruperu Bhirava Kona

Ooruperu Bhirava Kona

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.. అయితే ఈ హీరో ఖాతాలో హిట్ పడి చాలా కాలం అయ్యింది.. తాజాగా ‘ఊరు పేరు భైరవకోన ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఈ సినిమా ఈరోజు విడుదలైంది.. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా ఈ మూవీని నిర్మించారు.

ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక విడుదలకు రెండు రోజుల ముందు అంటే ఫిబ్రవరి 14న వేసిన పెయిడ్‌ ప్రీమియర్స్‌కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ రావడంతో పాటు సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య ఈరోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..

ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఊరి పేరు భైరవకోన’ ఎలా ఉంది? సందీప్‌ ఖాతాలో హిట్‌ పడిందా లేదా? అనేది ట్విట్టర్ ద్వారా నెటిజన్లు చర్చిస్తున్నారు..సూపర్‌ ఫాంటసీ థ్రిల్లర్‌ ‘ఊరు పేరు భైరవ కోన’లో కొన్ని సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్‌ నెమ్మదిగా సాగినప్పటికీ.. కథ ఆకట్టుకునేలా ఉంటుంది. సెకండాఫ్‌ కొంత సమయం తర్వాత ట్రాక్ నుండి బయటపడి ఊహాజనిత మోడ్‌లోకి వెళుతుంది. ప్రీ-ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రత్యేకంగా నిలుస్తుంది.. మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటివరకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

Exit mobile version