NTV Telugu Site icon

Ooru Peru Bhairavakona Collections: దుమ్ము దులిపేసిన ‘ఊరు పేరు భైరవకోన ‘ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే?

Sandeep (2)

Sandeep (2)

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.. అయితే ఈ హీరో ఖాతాలో హిట్ పడి చాలా కాలం అయ్యింది.. తాజాగా ‘ఊరు పేరు భైరవకోన ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఈ సినిమా నిన్న విడుదలైంది.. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా ఈ మూవీని నిర్మించారు.. ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీగానే లభించింది. దీంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మరి సందీప్ ‘ఊరు పేరు భైరవకోన’ తొలి రోజు కలెక్షన్లను ఎంత రాబాట్టిందో చూద్దాం..

ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఊరి పేరు భైరవకోన’ ఎలా ఉంది? సందీప్‌ ఖాతాలో హిట్‌ పడిందా లేదా? అనేది ట్విట్టర్ ద్వారా నెటిజన్లు చర్చిస్తున్నారు..సూపర్‌ ఫాంటసీ థ్రిల్లర్‌ ‘ఊరు పేరు భైరవ కోన’లో కొన్ని సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్‌ నెమ్మదిగా సాగినప్పటికీ.. కథ ఆకట్టుకునేలా ఉంటుంది. సెకండాఫ్‌ కొంత సమయం తర్వాత ట్రాక్ నుండి బయటపడి ఊహాజనిత మోడ్‌లోకి వెళుతుంది. మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటివరకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఈరోజు కూడా ఇదే టాక్ తో దూసుకుపోతుంది. ఇక మొదటి రోజు కలెక్షన్ల విషయానికొస్తే 6 కోట్లకు పైగా రాబట్టింది. ఈ వీకెండ్ ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది..