OnePlus Nord 4 : వన్ ప్లస్ జూలై 16న భారతదేశంతోపాటు ఇతర దేశాలలో ఈవెంట్ ను నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్‌లో కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేయబోతుంది. అదే వన్ ప్లస్ నోర్డ్ 4. వన్ ప్లస్ తన సమ్మర్ లాంచ్ ఈవెంట్ జూలై 16న తేదీని కన్ఫర్మ్ చేసింది. కంపెనీ ఇప్పటికే నార్డ్ పోర్ట్‌ఫోలియో కింద లైట్, CE మోడల్ లను విడుదల చేసింది. అధికారిక లాంచ్ ఈవెంట్ కు ముందే పూర్తి స్పెసిఫికేషన్ షీట్, హ్యాండ్స్ ఆన్ ఇమేజ్‌లు, మొబైల్ ధర వెల్లడి చేయబడ్డాయి. ఇండియా టుడే ఒక నివేదికను ఉటంకిస్తూ ఈ సమాచారం ఇచ్చింది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.
Manipur : మణిపూర్‌లో భద్రతా బలగాలు సోదాలు… భారీగా ఆయుధాలు స్వాధీనం
OnePlus Nord 4 ఫీచర్లు:
వన్ ప్లస్ నోర్డ్ 4 6.74 అంగుళాల OLED Tianma U8+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్ కు మద్దతు ఇస్తుంది. అలాగే, ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్లతో వస్తుంది. ఇది 2150 నిట్స్ గరిష్ట ప్రకాశం కలిగి ఉంది. దీని ధర రూ. 31,999. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
OnePlus Nord 4 ప్రాసెసర్:
వన్ ప్లస్ నోర్డ్ 4 Qualcomm Snapdragon 7+ Gen 3 చిప్‌సెట్ ఉండవచ్చు. ఇది 5500 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS లో పని చేస్తుంది. ఇందులో యూజర్లకు 3 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్, 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచ్ లను అందించారు.
PM Modi : నేటి నుంచి మూడు రోజుల పాటు మోడీ విదేశీ పర్యటన.. ఆస్ట్రియాతో కీలక చర్చలు జరిపే ఛాన్స్
OnePlus Nord 4 కెమెరా సెటప్:
నివేదికల ప్రకారం, వన్ ప్లస్ నోర్డ్ 4 డ్యూయల్ వెనుక కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులోని ప్రైమరీ కెమెరా 50MP. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ IMX355 అల్ట్రావైడ్ యాంగిల్ ను కలిగి ఉంది. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ శాంసంగ్ S5K3P9 కెమెరా ఉంది. ఇది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అనేక మంచి ఫీచర్లతో అందించబడుతుంది.