NTV Telugu Site icon

OnePlus Nord 3 5G Price: వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీపై రూ. 25 వేల తగ్గింపు.. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే!

Oneplus Nord 3 5g New

Oneplus Nord 3 5g New

OnePlus Nord 3 5G Smartphone Offers in Amazon: చైనాకు చెందిన ‘వన్‌ప్లస్‌’ మొబైల్ కంపెనీ జులైలో ‘నార్డ్‌ 3 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇది శక్తివంతమైన ప్రీమియం స్మార్ట్‌ఫోన్. అద్భుతమైన కెమెరా, పెద్ద డిస్‌ప్లే, సూపర్ బ్యాటరీతో ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చింది. నార్డ్‌ 3 5జీ అమ్మకాలు భారీగా ఉన్నాయి. ఆరంభంలో అయితే ‘నో స్టాక్’ బోర్డు ఉండేది. అలాంటి స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. దాంతో నార్డ్‌ 3 5జీని పది వేల లోపు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.

OnePlus Nord 3 5G Exchange Offer:
వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 33999. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ ధర ఉంది. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌ ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ. 24900 ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ను అందిస్తోంది. పూర్తి ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ వర్తిస్తే ఈ ఫోన్ మీకు రూ. 9,099కి సొంతం అవుతుంది. అయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కండిషన్ బాగుండి, ఎలాంటి డామేజ్ లేకుండా లేటెస్ట్ వెర్షన్ అయితేనే ఈ పూర్తి ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ లభిస్తుంది. లేదంటే తక్కువ ఎక్స్‌ఛేంజ్‌ వస్తుంది.

Nord Buds 2R Free on OnePlus Nord 3 5G:
ఇక నార్డ్‌ 3 5జీ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్లు వన్‌ప్లస్‌ ప్రకటించింది. అమెజాన్‌, అధికారిక వన్‌ప్లస్‌ స్టోర్‌ నుంచి ఫోన్‌ను కొనుగోలు చేసినవారికి మాత్రమే నార్డ్‌ బడ్స్‌ 2ఆర్‌ను ఉచితంగా ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఈ బడ్స్‌ కంపెనీ అందిస్తున్న ఎంట్రీ- లెవెల్‌ ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌ ఫోన్స్‌. ఛార్జింగ్‌ కేస్‌తో కలిపి ఈ బడ్స్‌ బ్యాటరీ లైఫ్‌ 40 గంటలు. ఈ బడ్స్‌ 2ఆర్‌ ధర భారత్‌లో రూ.2,199.

Also Read: LIC Pension Plan: ఎల్ఐసీలో అదిరిపోయే ప్లాన్.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతినెల రూ.14 వేలు పెన్షన్..

OnePlus Nord 3 5G Specs:
వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీ ఫోన్‌ రెండు వేరియంట్లలో భారత్‌లో అందుబాటులో ఉంది. 8GB + 128GB ధర రూ.33,999 కాగా.. 16GB + 256GB ధర 37,999గా ఉంది. ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9,000 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌13తో వస్తోంది. 120Hz రీఫ్రెస్‌ రేట్‌ ఉన్న 6.74 అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP బ్యాక్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా ఇందులో ఉంటాయి. 80W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ఈ ఫోన్ కలిగి ఉంటుంది.

Show comments