NTV Telugu Site icon

OnePlus Launch Event: నేడే వన్‌ప్లస్ లాంచ్ ఈవెంట్.. లైవ్ ఎక్కడ చూడొచ్చంంటే!

One

One

తమ కంపెనీ సరికొత్త ప్రొడక్ట్స్‌ను కస్టమర్లకు పరిచయం చేసేందుకు వన్ ప్లస్ సిద్ధమైంది. నేడు (మంగళవారం) సాయంత్రం 7.30 గంటలకు వన్‌ప్లస్ మెగాలాంచ్ ఈవెంట్ లైవ్ మొదలవుతుంది. వన్‍ప్లస్ 11 5జీ, వన్‍ప్లస్ 11ఆర్ 5జీ, వన్‍ప్లస్ ప్యాడ్ ట్యాబ్, వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2, వన్‍ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో, స్మార్ట్ టీవీ, వన్‍ప్లస్ కీబోర్డు.. ఈ ఈవెంట్ ద్వారా ఇండియాలో లాంచ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ లాంచ్ ఈవెంట్ పూర్తి వివరాలు ఇవే.

వన్‍ప్లస్ క్లౌడ్ 11 లాంచ్ ఈవెంట్ నేటి సాయంత్రం 7.30 గంటలకు ఢిల్లీలో ప్రారంభం అవుతుంది. ఈ క్లౌడ్ 11 ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్.. వన్‌ప్లస్ వెబ్‌సైట్, వన్‌ప్లస్ అఫిషియల్ యూట్యూబ్‌ ఛానెల్స్‌లో చూడవచ్చు. రాత్రి 7.30 గంటల నుంచి యూజర్లు లైవ్ వీక్షించవచ్చు. కింద ఎంబెడ్ చేసి యూట్యూబ్ లింక్‌లు ఓపెన్ చేసి ప్రత్యక్ష ప్రసారం వీక్షించొచ్చు.

Website Live: https://www.oneplus.in/launch/11?tab=115G

Youtube Live: https://www.youtube.com/watch?v=vH8qHnuKRVI

OnePlus 11 5G: వన్‍ప్లస్ 11 5జీ ఫోన్ ఫ్లాగ్‍షిప్ రేంజ్‍లో ఉంటుంది. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2తో పాటు ప్రీమియమ్ కెమెరాలు, అదిరిపోయే 2కే డిస్‍ప్లేతో రానుంది. OISకు సపోర్ట్ చేసే హాసెల్‍బ్లాడ్ కెమెరాలు దీనికి మరో హైలైట్. వన్‍ప్లస్ 11ఆర్ 5జీ ప్రీమియమ్ మిడ్ రేంజ్ విభాగంలో వస్తుంది.

వన్‍ప్లస్ తొలి ట్యాబ్..

OnePlus Pad: వన్‍ప్లస్ నుంచి తొలి ట్యాబ్లెట్‍గా వన్‍ప్లస్ ప్యాడ్ రాబోతుంది. 11.6 ఇంచుల 2కే డిస్‍ప్లేతో ఈ ట్యాబ్ రానుంది. వన్‍ప్లస్ బడ్స్ ప్రో2 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ ప్రీమియమ్ రేంజ్‍లో ఉంటాయి. ANCతో పాటు అధునాతన ఫీచర్లతో ఈ బడ్స్ అందుబాటులోకి రానున్నాయి. వన్‍ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో కూడా 4కే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్ సహా ప్రీమియమ్ స్పెసిఫేకషన్లు, ఫీచర్లతోనే వస్తుంది. ఇక వన్‍ప్లస్ నుంచి తొలి కీబోర్డు కూడా ఈ క్లౌడ్ 11 ఈవెంట్ ద్వారానే భారత మార్కెట్‍లో లాంచ్ కానుంది.

Also Read: Abdul Razzaq: ఆసియా కప్ దుబాయ్‌లో నిర్వహిస్తే మంచిదే: పాక్ మాజీ క్రికెటర్