NTV Telugu Site icon

Shimla Cylinder Blast: సిమ్లా రెస్టారెంట్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి, 10 మంది గాయాలు

Cylinder Blast

Cylinder Blast

Shimla Cylinder Blast:హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఇక్కడి మాల్‌ రోడ్‌లోని ఓ రెస్టారెంట్‌లో సిలిండర్‌ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని సిమ్లా ఎస్పీ సంజీవ్‌కుమార్ గాంధీ బుధవారం వెల్లడించారు. ఈ పేలుడు తర్వాత ఆ ప్రాంతమంతా గందరగోళం నెలకొంది. జనం అటు ఇటు పరిగెత్తడం ప్రారంభించారు.

పేలుడులో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ గాంధీ తెలిపారు. వాస్తవానికి అగ్నిమాపక దళం కార్యాలయానికి సమీపంలోని రెస్టారెంట్‌లో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు దుకాణాలు ధ్వంసమైనట్లు సమాచారం. పేలుడు జరగడానికి 20 నిమిషాల ముందు ఎల్‌పీజీ గ్యాస్ గురించి తమకు సమాచారం అందించినట్లు స్థానికులు తెలిపారు.

Read Also:Success Story: రోజూ కూలీ పనులకు వెళ్తూనే పీహెచ్‌డీ సాధించింది.. ఇది కదా సక్సెస్ అంటే!

సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఈ పేలుడు శబ్ధం కొన్ని కిలోమీటర్ల మేర వినిపించింది.

ఈ పేలుడులో ఒకరు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారని సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ గాంధీ తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు జరిగిన తర్వాత పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. పేలుడుకు గల కారణాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Read Also:Coocaa Smart TV: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్.. 54990 వేల స్మార్ట్ టీవీ కేవలం 11 వేలకే!