యూట్యూబ్‌లో మరోసారి సబ్ స్ర్కైబర్ల యుద్ధం మొదలైంది. ఇంతకుముందు ఈ యుద్ధం ప్యూడీపీ, టీ-సిరీస్ మధ్య జరిగింది. ఇప్పుడు ఈ యుద్ధం ఒక అమెరికన్ యూట్యూబర్, టీ-సిరీస్ మధ్య జరుగుతోంది. నిజానికి.. MrBeast అకా జిమ్మీ డోనాల్డ్‌సన్, T-సిరీస్‌ల సబ్ స్ర్కైబర్ల సంఖ్యలో వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. T-Sereis అత్యధిక సంఖ్యలో సబ్ స్ర్కైబర్లను కలిగి ఉంది. అత్యధిక సంఖ్యలోసబ్ స్ర్కైబర్లతో గొప్ప పేరును పొందాలని మిస్టర్ బీస్ట్ కోరుకుంటున్నారు. దీని కోసం సోషల్ మీడియాలో నిరంతరం పోస్టులు కూడా పెడుతున్నారు. ఇద్దరి సబ్ స్ర్కైబర్ల సంఖ్యలో కేవలం 1 మిలియన్( 10 లక్షలు) తేడా ఉంది.
READ MORE: Mallikarjun Kharge: ఇండియా కూటమి కనీసం 295 సీట్లతో అధికారంలోకి వస్తుంది..
యూట్యూబ్‌లో టీ-సిరీస్ సబ్ స్ర్కైబర్ల సంఖ్య 266 మిలియన్లు. మిస్టర్ బీస్ట్ ఛానెల్ కూడా తాజాగా 265 మిలియన్లకు చేరుకుంది. అయితే.. రెండు ఛానెల్‌ల కంటెంట్‌లో చాలా తేడా ఉంది. టీ-సిరీస్ ఒక రికార్డ్ లేబుల్. ఈ ఛానెల్‌లో ఎక్కువగా మ్యూజిక్ వీడియోలు, సినిమా ట్రైలర్‌లను చూస్తుంటారు. MrBeast ఛానెల్‌లో ఛాలెంజ్, బహుమతి, స్టంట్ వంటి వీడియోలు అందుబాటులో ఉన్నాయి. గత నెలలో మిస్టర్ బీస్ట్.. టీ-సిరీస్ CEOని బాక్సింగ్ మ్యాచ్‌కి సవాలు చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఆ సమయంలో మిస్టర్ బీస్ట్ ఫాలోవర్స్ సంఖ్య 258 మిలియన్లు, టీ-సిరీస్ సబ్ స్ర్కైబర్లు 265 మిలియన్లు ఉండేవారు. రెండింటి మధ్య 6.68 మిలియన్ల వ్యత్యాసం ఉండేది. మిస్టర్ బీస్ట్ ఈ యుద్ధం గురించి సోషల్ మీడియాలో నిరంతరం పోస్ట్ లు పెడుతున్నారు. దీంతో కేవలం రెండు వారాల్లో.. మిస్టర్ బీస్ట్ ఛానెల్‌లో సబ్ స్ర్కైబర్ల సంఖ్య 265 మిలియన్లకు పెరిగింది. ఇంతకు ముందు కూడా యూట్యూబ్‌లో T-Series, PewDiePie మధ్య యుద్ధం జరిగింది. 2019 సంవత్సరంలో, టీ-సిరీస్ 100 మిలియన్ యూట్యూబ్ సబ్ స్ర్కైబర్ల టైటిల్‌ను సాధించింది.