విశ్వనటుడు కమల్ హాసన్ ,కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన “ఇండియన్” అప్పట్లో అద్భుత విజయం సాధించి భారీగా వసూళ్లను కూడా రాబట్టింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది.ఇప్పుడు ఈ సీక్వెల్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీనితో ఈ మూవీని జూన్ లో రిలీజ్చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమా రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది.
జులై 12న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ చూస్తున్నట్లు సమాచారం.అలాగే ఈ మూవీ రిలీజ్ పోస్టుపోన్ కావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా మేకర్స్ వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 16న ఎంతో గ్రాండ్ గా నిర్వహించాలని దర్శకుడు శంకర్ ప్లాన్ చేసారు. ఈక్రమంలోనే ఆ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు గ్లోబల్ స్టార్ రాంచరణ్ ను ఆహ్వానించ్చినట్లు సమాచారం. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూలై 1వ తేదీన నిర్వహించనున్నట్లు సమాచారం.మరి ఇండియన్ 2 ఈ డేట్ కైనా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి .