NTV Telugu Site icon

OLA S1 Pro Price: ఓలా నుంచి 2 సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఫుల్ ఛార్జింగ్‌తో 151కిమీ ప్రయాణం!

Ola S1 Pro Gen 2

Ola S1 Pro Gen 2

OLA S1 X and OLA S1 Pro Gen 2 Electric Scooters Launch and Price: ప్రస్తుతం భారత ఆటో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడంతో జనాలు ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్స్, బైక్స్, కార్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో దూసుకుపోతున్న బెంగళూరుకు చెందిన ‘ఓలా’ కంపెనీ.. తాజాగా మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను రిలీజ్ చేసింది. ఓలా ఎస్‌ 1 ఎక్స్‌ (ola S1X), ఓలా ఎస్‌ 1 ప్రో జనరేషన్‌ 2 (ola S1 Pro Gen 2)లను ఆగస్టు 15న సందర్భంగా ‘కస్టమర్‌ డే’ పేరిట నిర్వహించిన ఈవెంట్‌లో లాంచ్‌ చేసింది.

ఓలా ఎస్1 ఎక్స్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ఎస్‌1 రేంజ్‌కు ఎంట్రీ పాయింట్‌గా ఉంది. ఈ స్కూటర్ ధర రూ. 79,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 21 వరకు మాత్రమే ఈ ధర ఉంటుంది. ఆపై పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఓలా ఎస్‌ 1 ప్రో జనరేషన్‌ 2 ఇప్పుడు మునుపటి కన్నా మెరుగైన ఫీచర్లతో వచ్చింది. ఇది అధిక పవర్, హై రేంజ్ కలిగి ఉంది. ఈ బైక్ ధర రూ. 1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

ఓలా ఎస్1 ఎక్స్‌ని కంపెనీ మూడు విభిన్న వేరియంట్‌లలో రిలీజ్ చేసింది. ఎస్1 ఎక్స్‌ ప్లస్, ఎస్1 ఎక్స్‌ 2kWh బ్యాటరీ, ఎస్1 ఎక్స్‌ 3kWh వేరియెంట్స్ ఉన్నాయి. ఎస్1 ఎక్స్‌ ప్లస్ 5.0 ఇంచెస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వచ్చే టాప్ మోడల్. ఎక్స్‌ మోడల్‌లు 3.5-అంగుళాల డిస్‌ప్లేతో వస్తాయి.అయితే యాంత్రికంగా అన్ని ఒకే విధంగా ఉంటాయి. ఎస్1 ఎక్స్‌ ప్లస్, ఎస్1 ఎక్స్‌3 స్కూటర్లు 3kWh బ్యాటరీ ప్యాక్‌తో 6kW (8.15bhp) ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటాయి. ఈ రెండు ఫుల్ ఛార్జింగ్‌తో 151కిమీల రేంజ్ ఇస్తాయి. 90కిమీల గరిష్ట వేగం, 0 నుంచి 40కిమీల వేగానికి 3.3 సెకన్లలో అందుకుంటుంది.

Also Read: Tecno Pova 5 Pro 5G Price: టెక్నో పోవా 5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. 15 వేలకే 8GB RAM, 256GB వేరియంట్‌!

ఓలా ఎస్1 ఎక్స్‌2 స్కూటర్ 6kW మోటార్‌తో 2kWh బ్యాటరీతో వస్తుంది. స్కూటర్ రేంజ్ 91కిమీ. గరిష్ట వేగం 85 కిమీ. ఎస్1 ఎక్స్‌ ప్లస్ ని రూ. 99,999తో ఆగస్టు 21 వరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ల డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. ఇక ఎస్1 ఎక్స్‌3, ఎస్1 ఎక్స్‌2 ప్రీ రిజర్వేషన్ రూ. 999కి అందుబాటులో ఉంది. ఎస్1 ఎక్స్‌3 ధర రూ. 89,999 కాగా.. ఎస్1 ఎక్స్‌2 ధర రూ. 79,999గా ఉంది. ఈ ధరలు ఆగస్టు 21 వరకు ఉన్నాయి. డిసెంబర్‌లో ఈ స్కూటర్‌ల డెలివరీలు ఉంటాయి.

ఎస్‌1 ఎయిర్ జనరేషన్‌ 2ని కూడా ఓలా లాంచ్ చేసింది. 11kW మోటార్‌ను ఉపయోగిస్తున్న పవర్‌ట్రెయిన్‌లో మార్పులతో పాటుగా ఎస్‌ 1 ప్రో జనరేషన్‌ 2 కేవలం 0 నుంచి 40kmph వరకు 120kmph గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. ఈ స్కూటర్ రేంజ్ 195 కిమీ. ఇందులో టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, వెనుకవైపు మెరుగైన మోనోషాక్ ఉన్నాయి. ఓలా ఎస్‌1 ప్రో జనరేషన్‌ 2 ధర రూ. 1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ స్సీప్ట్ర సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది.