NTV Telugu Site icon

Officer on Duty Trailer: మలయాళ సూపర్ హిట్ క్రైమ్‌ థ్రిల్లర్‌.. తెలుగు ట్రైలర్‌ విడుదల..

Officer On Duty

Officer On Duty

మల్లూవుడ్.. సస్పెన్స్, క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకుటోంది. ఈ ఏడాది జనవరిలో వచ్చిన స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ రేఖా చిత్రం.. రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను చేసిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన “ఆఫీసర్ ఆన్ డ్యూటీ” కూడా అదే ఫ్లోలో దూసుకుపోతోంది. మాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన కుంచాకో బోబన్ ఈ సినిమాలో తన ప్రతిభ కనబరిచాడు. ఫిబ్రవరి 20 రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పటి వరకు రూ.30 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో రెండవ స్థానం సంపాధించింది. రూ. 12 కోట్ల పెట్టి తెరకెక్కిస్తే.. నాలుగు రోజుల్లోనే పిక్చర్ ప్రాఫిట్ చూసింది.

ఇంకా మలయాళ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకెళుతోంది. ఈ సినిమాలో కున్‌చకో బొబన్‌ తో పాటు, ప్రియమణి , జగదీశ్‌, విశాక్‌ నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా.. మార్చి 7న ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. నకిలీ బంగారు ఆభరణాల కేసు దర్యాప్తులో భాగంగా హరిశంకర్‌ అనే పోలీసు ఎదుర్కొన్న సవాళ్లు, పోలీసుగా కొనసాగుతున్న హరిశంకర్ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు, తదితర అంశాలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి..