Site icon NTV Telugu

Numaish: ఈ సారి నుమాయిష్‌ ఆలస్యం..!

Numaish

Numaish

Numaish: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రతి సంవత్సరం నిర్వహించే నుమాయిష్ (అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన) ఈ సంవత్సరం వాయిదా పడింది. సాధారణంగా జనవరి 1న ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన దాదాపు 46 రోజుల పాటు జరుగుతుంది. అయితే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా నుమాయిష్ రెండు రోజుల పాటు వాయిదా పడిందని నిర్వాహకులు తెలిపారు.

జనవరి 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్ ప్రారంభం కానుంది. ప్రదర్శనకు సంబంధించి సుమారు 2,500 స్టాళ్ల నిర్మాణానికి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు, స్టాళ్ల కేటాయింపు చివరి దశకు చేరుకున్నది. ప్రదర్శన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

1938లో నిజాం కాలంలో ప్రారంభమైన నుమాయిష్, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రదర్శనను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తూ, ప్రత్యేకతను కలిగించే వార్షిక ఈవెంట్‌గా గుర్తిస్తారు.

Exit mobile version