Site icon NTV Telugu

JR NTR : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్

Ntr Trivikram

Ntr Trivikram

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన అరవింద సమేత సూపర్ హిట్ సాధించింది. లాంగ్ గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై భారీ ఎత్తున నిర్మించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫినిష్ అయిన వెంటనే తారక్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నాడు నిర్మాత నాగవంశి.

Also Read : Exclusive : ఎన్టీఆర్ తో కాదు.. రామ్ చరణ్ తో తమిళ డైరెక్టర్ సినిమా ఫిక్స్

కాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను స్టార్ట్  చేసారు దర్శకుడు త్రివిక్రమ్. అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ భారీ మార్పులు చేస్తున్నాడు. ఇప్పటి వరకు తనతో ఉన్న టీమ్ మొత్తాన్ని పక్కన పెట్టి మరొక న్యూ రైటర్స్ టీమ్ ను తీసుకున్నాడు. ఎన్టీఆర్ తో తెరకెక్కించే ఈ సినిమా త్రివ్రిక్రమ్ కెరీర్ లోనే బెస్ట్ వర్క్ ఫిల్మ్ గా ఉండబోతుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిల్స్ లో ఒక టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలు చేసిన త్రివిక్రమ్ తొలిసారి మైథలాజికల్ సినిమా చేస్తున్నారు.  దాంతో ఈ సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోయే  ఈ సినిమాను వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ నుండి షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లానింగ్ చేస్తున్నారు. ఈ లోగా ఇటు త్రివిక్రమ్ చేస్తున్న వెంకీ సినిమాను అటు నీల్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాను ఎన్టీఆర్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version