NTV Telugu Site icon

Tollywood : గోవా లో ఎన్టీఆర్, ప్రగతి రిసార్ట్స్ లో అల్లు అర్జున్..?

Ntr,alluarjun

Ntr,alluarjun

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు అన్ని కూడా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.ఈ స్టార్ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”..ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కోరుట్ల శివ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో గ్రాండ్ జరుగుతుంది.ఇక్కడ కొంత టాకీ పార్ట్ తో పాటు ఓ సాంగ్ ను కూడా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “..ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ప్రగతి రిసార్ట్స్ లో జరుగుతుంది.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ,యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ “విశ్వంభర”..ఈ నెల 12 నుంచి అన్నపూర్ణ 7 ఏకేర్స్ లో జరుగుతుంది.ఈ షూటింగ్ లో చిరంజీవి ఈ నెల 13 నుంచి జాయిన్ అవుతారు.

గ్లోబల్ స్టార్ రాంచరణ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్నా మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరుగుతుంది.

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం”.వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్నా లేటెస్ట్ మూవీ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతుంది.

మ్యాచో స్టార్ గోపీచంద్ ,స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “విశ్వం”.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మేడ్చల్ పరిసర ప్రాంతాలలో జరుగుతుంది.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ,టాలీవుడ్ స్టార్ డైరెక శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “కుబేర”..ఈ మూవీలో అక్కినేని నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సారధి స్టూడియోలో జరుగుతుంది.

చార్మింగ్ స్టార్ శర్వానంద్,అభిలాష్ కంకర కాంబినేషన్ లో వస్తున్న ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుంది.

తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ “కంగువ”.స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పఠాన్ చెరు పరిసర ప్రాంతాలలో జరుగుతుంది.

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లక్కీ భాస్కర్”..ఈ సినిమాను “సార్” మూవీ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది.

Show comments