NTR : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”..మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ,ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా స్టోరీ లెంగ్త్ ఎక్కువ కావడంతో ఈ సినిమాను దర్శకుడు కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా మొదటి పార్ట్ ను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Also :War 2 : ‘వార్ 2’ లో ఆ ఫైట్ సీన్ హైలైట్ గా నిలువనుందా..?
ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ అయిన “ఫియర్ సాంగ్ ” ను రిలీజ్ చేసారు.”దూకే ధైర్యమా జాగ్రత్త ..దేవర ముందు నువ్వెంత ” అంటూ సాగె ఈ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇటీవలే ఓ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఫ్యామిలీ తో కలిసి థాయిలాండ్ వెళ్లగా తాజాగా నేడు హైదరాబాద్ చేరుకున్నాడు.ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతువుంది.తాజాగా ఎన్టీఆర్ మరింత స్టైలిష్ గా కనిపించారు.వైట్ టి షర్ట్ లో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో అలరించాడు.ఎన్టీఆర్ లుక్ చూసిన ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.