జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మణికంఠ అనుమానాస్పద మరణ వార్త ఇప్పుడు బాగా వైరల్ గా మారింది.శ్యామ్ మణికంఠ మృతికి న్యాయం చేయాలని ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషాద సంఘటన గురించి ఎన్టీఆర్ కు తెలియగానే వెంటనే ప్రెస్ నోట్ విడుదల చేస్తూ శ్యామ్ మృతి పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసాడు.ఆ ప్రెస్ నోట్ లో ఎన్టీఆర్ ఈ విధంగా స్పంధించాడు.”శ్యామ్ మరణం చాలా బాధాకరమైన సంఘటన. అతని తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతి నీ తెలియజేస్తున్నాను. శ్యామ్ ఎలా చనిపోయాడో తెలియడం లేదు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వ అధికారులను నేను కోరుతున్నాను అంటూ ఆయన విడుదల చేసిన ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కోన సీమ జిల్లా కాట్రేనికోన మండలం కొప్పిగుంటకు చెందిన శ్యామ్ మణికంఠ తన అమ్మమ్మ ఇంటి వద్ద శనివారం అనుమానస్పద స్థితిలో ఉరేసుకొని చనిపోయారు. శ్యామ్ మణికంఠ మృతిపై అతని తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడిది అస్సలు ఆత్మహత్య కాదు హత్య అని బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలిలో ఆనవాళ్లను చూస్తే ఎవరో హత్య చేసినట్లు అయితే కనిపిస్తోందని మృతుని బంధువులు కూడా చెబుతున్నారు.
శ్యామ్ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. శ్యామ్ మరణంలో వైసీపీ నేతల ప్రమేయం ఉందని కూడా ఆయన ట్వీట్ చేశారు. యువకుడి మృతిపై సమగ్ర విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ ఘటన పై నారా లోకేష్ విచారణ వ్యక్తం చేశారు. శ్యామ్ మరణం ఎంతో బాధ కలిగించిదంటూ ట్వీట్ చేశారు. వైసీపీ పాలనలో ఎవరికి కూడా రక్షణ లేదంటూ ఆయన మండి పడ్డారు.. శ్యామ్ అనుమానాస్పద మృతిపై పూర్తి విచారణ జరపాలని లోకేష్ డిమాండ్ చేశారు. వైసీపీ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని లోకేష్ కోరారు.