నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్) లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 180 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మెడికల్ ఫిట్‌నెస్ & బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ తప్పనిసరి. అప్లికేషన్ ఫీజు రూ.800 + 18% GST (అందరికీ వర్తిస్తుంది, రీఫండ్ లేదు). పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
అర్హత విషయానికి వస్తే.. వయోపరిమితి (01.04.2026 నాటికి) 21 నుండి 30 సంవత్సరాలు కలిగి ఉండాలి. (02.04.1996 తర్వాత జన్మించినవారు, 01.04.2005 ముందు జన్మించినవారు అనుమతి లేదు.) ఏదైనా డిసిప్లిన్‌లో గ్రాడ్యుయేట్ (కనీసం 55% మార్కులు aggregate). యూనివర్సిటీ గుర్తింపు పొందినది కావాలి. కరస్పాండెన్స్ / డిస్టెన్స్ / పార్ట్-టైమ్ కోర్సులు అనుమతించబడవు. కంప్యూటర్ సిస్టమ్స్‌లో ఆపరేటింగ్ & వర్కింగ్ నాలెడ్జ్ తప్పనిసరి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. ఫైనల్ రిజల్ట్ 01.04.2026 లోపు వెలువడాలి. ఇంటర్వ్యూకు వచ్చినప్పుడు అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపు ప్రారంభం: 16.04.2026
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & ఫీజు చెల్లింపు ముగింపు: 30.04.2026
ఆన్‌లైన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: పరీక్షకు 7-10 రోజుల ముందు
ఆన్‌లైన్ పరీక్ష (తాత్కాలికం): జూన్ 2026 మొదటి వారం
జీతం
(CTC)నగరం కేటగిరీ (I, II, III) ప్రకారం మారుతుంది
Basic Pay: రూ.20,000
మొత్తం నెలవారీ CTC: రూ.41,509 (Category I) / రూ.39,909 (II) / రూ.38,709 (III)
సంవత్సరానికి CTC: రూ.4,98,108 (I) / రూ.4,78,908 (II) / రూ.4,64,508 (III)
నెట్ పే (దాదాపు): రూ.29,527 (I) / రూ.27,927 (II) / రూ.26,727 (III) + Meal Coupon రూ.5,040
